టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లి పీటలు ఎక్కింది. ఇటీవలే తన ప్రియుడిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా తన చిరకాల స్నేహితుడు సాయి విష్ణుతో మేఘా ఆకాష్ రిలేషన్‌లో ఉంది. ఇక వారి పెళ్లికి ఇరుకుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నిల్ ఇవ్వడంతో ఈ జంట పెళ్లికి సిద్ధమైంది. ఈ క్రమంలో గత నెలలో ప్రియుడు సాయి విష్ణుతో సైలెంట్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న మేఘా తాజాగా అతడితో ఏడడుగులు వేసింది. చైన్నైలో జరిగిని వీరి పెళ్లికి ఇరుకుటుంబ సభ్యులు, కేవలం కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య జరిగింది.
ఇండస్ట్రీ కోసం చైన్నైలో నిన్న గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆయన తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో హాజరై వధువరులను ఆశీర్వదించారు. అలాగే ఇండస్ట్రీ ప్రముఖులు కూడా వీరి వివాహ రిసెప్షన్‌కి హాజరయ్యారు. మేఘా ఆకాశ్ వివాహ రిసెప్షన్‌కి వెళ్లిన సీఎం స్టాలిన్ కొత్త జంటకు శుభకాంక్షలు తెలుపుతూ తమిళంలో ట్వీట్ చేశారు. వధువరులతో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. చెన్నైలో జరిగిన ఈ గ్రాండ్ రిసెప్షన్‌లో పలువురు సినీతారలు, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. ప్రస్తుతం మేఘా ఆకాష్ వివాహ రిసెప్షన్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మేఘా ఆకాష్ భర్త బ్యాగ్రౌండ్ ఇదే!
మేఘా ఆకాష్ భర్త సాయి విష్ణు ఓ పొలిటిషియన్ కుమారుడని సమాచారం. ఈ క్రమంలో వీరి పెళ్లికి సీఎంతో సహా రాజకీయ ప్రముఖులంతా సందడి చేశారు. కాగా తెలుగు అమ్మాయి అయిన మేఘా ఆకాశ్ నటిగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. హీరోయిన్‌గా గ్లామరస్ పాత్రలు చేసింది. లేడీ ఒరియంటెడ్ రోల్స్ చేసి నటిగా మంచి గుర్తింపు పొందింది. 2017లో నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'లై' చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరోసారి నితిన్‌తోనే 'చల్ మోహనరంగా' సినిమాతో జోడికట్టింది.ఈ సినిమా తన గ్లామర్, నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మేఘా ఆకాష్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు.
రజనీకాంత్ పేట కోలీవుడ్ ఎంట్రీ
దీంతో తెలుగులో ఆఫర్స్ రాకపోవడం తమిళ ఇండస్ట్రీకి మకాం మార్చింది. ఇక్క రజనీకాంత్ ‘పేట’ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిచింది. తమిళంలోనూ గుర్తింపు పొందిన మేఘా ఆకాష్ రెండు భాషల్లోనూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసింది. తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేసి కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత తమిళంలో వరుసగా 'వందా రాజావాదాన్ వరువేన్', 'ఎన్నై నోక్కిపాయుం తోట్టా', 'వడకుపట్టి రామస్వామి','బూమరాంగ్' వంటి హిట్ చిత్రాల్లో నటించింది. రీసెంట్‌గా విజయ్ ఆంటోని 'తుఫాన్' సినిమాలో అలరించిన మేఘ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలకు సంతకం చేసినట్టు సమాచారం.
Also Read: 'మత్తు వదలరా2'పై చిరంజీవి రివ్యూ - ఎండ్ టైటిల్స్ కూడా వదలలేదంటూ ప్రశంసలు, ఇంకా ఏమన్నారంటే...