Devara Team Interaction with Sandeep Reddy Vanga: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన 'దేవర'‌ కథ తెలుసుకోవాలని అభిమానులతో పాటు ప్రేక్షకులకు చాలా ఆసక్తి ఉంది.‌ ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్ లేదా ట్రైలర్ చూస్తే... కథ గురించి ఎక్కువ క్లారిటీ ఇవ్వలేదు. తండ్రీ కొడుకుల క్యారెక్టర్లను మాత్రమే పరిచయం చేశారు. అయితే... 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో జరిగిన ఇంటరాక్షన్ ఇంటర్వ్యూలో అసలు కథ లీక్ చేసేసారు ఎన్టీఆర్. అలాగే, విలన్ రోల్ చేసిన సైఫ్ అలీ ఖాన్. 


నాలుగు గ్రామాలు... గ్రామ దేవతలు...
పూర్వీకుల ఆయుధాల కోసం పోరాటం!
మనిషికి బతికే అంత ధైర్యం చాలని, చంపేంత ధైర్యం అవసరం లేదని ఎన్టీఆర్ ఓ డైలాగ్ చెప్పారు. అది ట్రైలర్‌లో ఉంది.‌ కాదూ కూడదని ఎవరైనా చంపేంత ధైర్యాన్ని కూడకడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతానని వార్నింగ్ కూడా ఇచ్చారు.‌‌ భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సముద్రంలోకి ఎక్కితే ఆ రోజు నుంచి కానరాని భయాన్ని అవుతానని కూడా హెచ్చరించారు. అయితే ఆయన చేసిన హెచ్చరిక ఎవరికి? ఆయనది ఏ ఊరు? అనే విషయాల్లోకి వెళితే....


'దేవర' కథ నాలుగు గ్రామాల మధ్య జరుగుతుందని సందీప్ రెడ్డి వంగాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పారు. ఆ గ్రామాల ప్రజలు గ్రామ దేవతలకు పూజ చేస్తారని తెలిపారు. పూర్వీకుల ఆయుధాల కోసం పోరు జరుగుతుందని బైరా పాత్ర చేసిన ఎన్టీఆర్ వివరించారు.‌ టీజర్, ట్రైలర్ చూస్తే కత్తులను ఊరేగింపు గా తీసుకు వెళుతున్న దృశ్యాలు ఉన్నాయి. నాలుగు గ్రామాల్లో ఏ గ్రామానికి పేరు ఉండదని, ఆ నాలుగు గ్రామాలు సముద్ర తీరంలోని ఓ కొండ ప్రాంతంలో ఉంటాయని చెప్పారు.


Also Readపెళ్లికి ముందు కండిషన్స్ పెట్టిన అక్కినేని ఫ్యామిలీ? - అందుకు శోభిత నో చెప్పడం వెనుక రీజన్ అదేనా?



పూర్వీకుల ఆయుధాలను గ్రామస్తులు పూజలు చేస్తారని, ఆ ఆయుధాల కోసం ఎంత దూరం అయినా వెళతారని ఎన్టీఆర్ పేర్కొన్నారు. మరి, ఆ ఆయుధాలు ఏమిటి? అనేది చూడాలి. 'దేవర' టైటిల్ డిజైన్ చూస్తే కత్తులు కనిపిస్తాయి. కథను రిలేట్ చేసేలా కొరటాల శివ ఆ టైటిల్ డిజైన్ చేశారని అనుకోవాలి.


నాలుగు గ్రామాల్లో ఓ గ్రామానికి బైరా పాత్ర చేసిన సైఫ్ అలీ ఖాన్ నాయకుడు కాగా... మరో గ్రామానికి దేవర పాత్ర చేసిన ఎన్టీఆర్ నాయకుడు. ఫిక్షనల్ ప్రపంచంలో ఈ సినిమా కథ జరుగుతుందని ఎన్టీఆర్ వివరించారు. సముద్ర తీరంలోని ఓ నాలుగు గ్రామాల మధ్య సినిమా ఉంటుందన్నారు.



టైమ్ లైన్ ఏంటి? ఏ కాలంలో జరిగే కథ?
'దేవర' ప్రచార చిత్రాలు చూస్తే... కొత్త ప్రపంచం కనబడుతుంది. మరి, ఈ సినిమా ఏ కాలంలో జరుగుతుంది? అంటే... 1980, 90లలో కథ ఉంటుందని ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ తెలిపారు. అయితే... ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పాటించే ఆచారాలను ఈ సినిమాలో చూపించామని దర్శకుడు కొరటాల శివ వివరించారు. అయితే... 80, 90లలో జరిగే కథ అయినా పూర్తిగా రిమోట్ ప్రాంతంలో జరుగుతుందని చెప్పారు.


Also Read: జాన్వీ కపూర్ కట్టిన చీర రేటు ఎంతో తెలుసా? ఇయర్ రింగ్స్ 13 లక్షలు ఏంటి బాసూ!