Megastar Chiranjeevi About Mathu Vadalara 2 movie: యంగ్‌ హీరో శ్రీసింహా, కమెడియన్‌ సత్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన రీసెంట్‌ మూవీ 'మత్తు వదలరా 2'. 2019లో వచ్చి మత్తు వదలరా మూవీకి ఇది సీక్వెల్‌.  మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రితేష్ రానా దర్శకత్వంతో 'మత్తు వదలరా 2'ను సస్పెన్స్ క్రైం కామెడీగా తెరకెక్కింది. సెప్టెంబర్‌ 13న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీతో ఆడియన్స్‌ బాగా ఆకట్టుకుంటుంది. ఫస్ట్‌డే ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ టాక్‌తో థియేటర్లో దూసుకుపోతుంది. చిన్న సినిమాగా వచ్చిన మత్తు వదలరా 2పై ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.


ముఖ్యంగా వెన్నెల కిషోర్‌, సత్య కామెడీపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే మత్తు వదలరా 2పై సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన రివ్యూ ఇచ్చారు. మూవీ మొదటి నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉన్నామని, ముఖ్యంగా స్క్రీన్‌పై వెన్నెల కిషోర్‌ కనిపించినప్పుడల్లా తన కూతురు సీతార నవ్వు ఆపుకోలేకపోయిందంటూ ప్రశంసించారు. ఇక తాజాగా ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవి మత్తు వదలరా 2 మూవీపై తన రివ్యూ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా చూసిన ఆయన ఎక్స్‌ వేదిక మత్తు వదలరా? అనుభవాన్ని పంచుకున్నారు. మత్తు వదలరా 2 సినిమా చూసిన వారికి 100 శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారంటీ అన్నారు. 






ఎండ్‌ టైటిల్స్‌ని కూడా వదలేదు..


"నిన్ననే 'మత్తు వదలరా - 2' సినిమా చూశాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. ఎండ్‌ టైటిల్స్‌ని (End Titles) కూడా వదలకుండా చూశాను. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్‌ రితేష్ రాణాకి ఇవ్వాలి. అతని రాత , తీత , కోత , మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పరిచిన విధానానికి అభినందించకుండా ఉండలేము. హ్యాట్రాఫ్‌ రితేష్‌ రాణా(Hats off @RiteshRana). అలాగే నటీనటులు సింహ కోడూరి (@Simhakoduri23) ముఖ్యంగా సత్యకి నా అభినందనలు!



అలాగే హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కాలభైరవలకు ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ, మత్తు వదలరా 2 టీం అందరికి నా అభినందలు.  ఈ సినిమాను అసలు మిస్‌ అవ్వకండి. మత్తు వదలరా 2 వంద శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారంటీ మూవీ" అంటూ చిరంజీవి మూవీపై ప్రశంసలు కురిపించారు. ఇలా ఇండస్ట్రీ ప్రముఖులంతా ఈ సినిమాపై రివ్యూ ఇస్తుండటంతో మత్తు వదలరా2 చిత్రానికి రోజురోజుకు బజ్‌ మరింత పెరుగుతుంది. కేవలం మౌత్‌ టాక్‌తోనే ఈ సినిమా కోసం థియేటర్లకు ఆడియన్స్‌ క్యూ కడుతున్నారు.



Also Read: అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవు - 11 రోజులు ఫుట్‌పాత్‌పై పడుకున్న, రాజ్‌ తరుణ్‌ షాకింగ్‌ కామెంట్స్‌