తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం... దక్షిణాది భాషలకు చెందిన సినిమాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తారలకు ప్రతి ఏడాది సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డులు ఇవ్వడం జరుగుతున్నది. సెప్టెంబర్ 14 (శనివారం రాత్రి) తెలుగు, కన్నడ భాషలకు అవార్డులు ఇచ్చారు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో ఈ ఏడాది ఎవరెవరు విజేతలుగా నిలిచారో తెలుసా?
బాలకృష్ణ 'భగవంత్ కేసరి' బెస్ట్ ఫిల్మ్
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా 'భగవంత్ కేసరి'. ఆడ పిల్లలను ఆడ పులి కింద పెంచాలనే సందేశంతో రూపొందించిన చిత్రమిది. సందేశంతో పాటు వాణిజ్య విలువలు కూడా ఉన్నాయి. ఈ చిత్రానికి 'సైమా 2024' బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చింది. ఇందులో శ్రీ లీల ప్రధాన పాత్ర పోషించగా, బాలయ్య సరసన కాజల్ సందడి చేశారు. అల్లు అరవింద్ చేతుల మీదుగా చిత్ర నిర్మాత అవార్డు అందుకున్నారు.
Also Read: మహేష్ బాబు మెచ్చిన 'మత్తు వదలరా 2'... ఆ కమెడియన్ క్యారెక్టర్ చూసి సితార పడీపడీ నవ్విందట
ఉత్తమ నటీనటులుగా దసరా జంట నాని, కీర్తి
నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా 'దసరా'. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మాస్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నాని, కీర్తిల నటనకు కీర్తి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు అవార్డులు కూడా వచ్చాయి. 'దసరా' సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడుగా నానినీ, ఉత్తమ నటిగా కీర్తి సురేష్ (Keerthy Suresh)నీ ఎంపిక చేసింది సైమా. వీళ్ళిద్దరే కాదు... దర్శకుడుగా శ్రీకాంత్ ఓదెల, సహాయ నటుడుగా దీక్షిత్ శెట్టి సైతం సైమా అవార్డులు అందుకున్నారు.
Also Read: పెళ్లికి ముందు కండిషన్స్ పెట్టిన అక్కినేని ఫ్యామిలీ? - అందుకు శోభిత నో చెప్పడం వెనుక రీజన్ అదేనా?
సైమా 2024లో ఎవరెవరు విజేతలుగా నిలిచారో చూడండి:
ఉత్తమ నటుడు: నాని (దసరా సినిమా)
ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా సినిమా)
ఉత్తమ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా సినిమా)
ఉత్తమ సినిమా: 'భగవంత్ కేసరి'
ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్ శెట్టి (దసరా సినిమా)
ఉత్తమ సహాయ నటి: బేబీ కియారా ఖన్నా (హాయ్ నాన్న సినిమా)
ఉత్తమ హాస్యనటుడు: విష్ణు (మ్యాడ్ సినిమా)
ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్: శృతి హాసన్
ఉత్తమ సంగీత దర్శకుడు: అబ్దుల్ వాహాబ్ (హాయ్ నాన్న, ఖుషి సినిమాలు)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ (సలార్ సినిమా)
ఉత్తమ గాయకుడు: రామ్ మిరియాల ('బలగం' సినిమాలో 'ఊరు పల్లెటూరు' పాట)
ఉత్తమ నటి(మొదటి సినిమా): వైష్ణవి చైతన్య (బేబీ)
ఉత్తమ నటుడు (మొదటి సినిమా): సంగీత్ శోభన్ (మ్యాడ్)
ఉత్తమ దర్శకుడు (మొదటి సినిమా): శౌర్యువ్ (హాయ్ నాన్న సినిమా)
ఉత్తమ నిర్మాత (మొదటి సినిమా): వైరా ఎంటర్టైన్మెంట్స్ (హాయ్ నాన్న సినిమా)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆనంద్ దేవరకొండ (బేబీ సినిమా)
ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): సాయి రాజేష్