సూపర్ స్టార్ మహేష్ బాబు మద్దతు మంచి సినిమాలకు ఎప్పుడు ఉంటుందని మరోసారి రుజువయింది. ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి రెండో తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా, యంగ్ అండ్ టాలెంటెడ్ కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'మత్తు వదలరా 2'. మహేష్ బాబుకు ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన చిత్రమిది. ఆయన శనివారం రాత్రి సినిమాపై స్పెషల్ ట్వీట్ చేశారు.
సినిమాను బాగా ఎంజాయ్ చేశా!
'మత్తు వదలరా 2' మంచి వినోదాత్మక చిత్రమని, సినిమాను బాగా ఎంజాయ్ చేశానని మహేష్ బాబు సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో పేర్కొన్నారు. ''శ్రీ సింహ కోడూరి చక్కగా నటించాడు'' అని ఆయన ట్వీట్ చేశారు. కమెడియన్స్ గురించి మహేష్ ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం.
''వెన్నెల కిషోర్... నువ్వు స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు మా అమ్మాయి సితార ఘట్టమనేని నవ్వకుండా ఆగలేకపోయింది. సత్య... నువ్వు తెరపై కనిపించిన ప్రతిసారి మేమంతా నవ్వకుండా ఉండలేకపోయాం. అంత అద్భుతంగా నటించావు (అవుట్ స్టాండింగ్ యాక్టింగ్). సినిమా టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్'' అని మహేష్ బాబు రివ్యూ ఇచ్చారు.
Also Read: పెళ్లికి ముందు కండిషన్స్ పెట్టిన అక్కినేని ఫ్యామిలీ? - అందుకు శోభిత నో చెప్పడం వెనుక రీజన్ అదేనా?
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ప్రశంసలు అందుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చిత్ర నిర్మాణ సంస్థ క్లాప్ ఎంటర్టైన్మెంట్, ఈ చిత్రాన్ని విడుదల చేసిన మైత్రి మూవీ మేకర్స్ పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ఆయనకు థాంక్స్ చెప్పాయి.
రెండో రోజుకు డబుల్ అయిన కలెక్షన్స్!
'మత్తు వదలరా 2 'విడుదలైన శుక్రవారం రోజున సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ఐదు కోట్ల 30 లక్షల రూపాయలను కలెక్ట్ చేసింది ఈ సినిమా. రెండో రోజు కలెక్షన్స్ కలుపుకుంటే ఆ ఫిగర్ డబల్ అయినట్లు తెలుస్తోంది. రెండో రోజుకు సినిమా 10 కోట్ల రూపాయలకు మార్క్ చేరిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ సాధించిన కామెడీ సినిమా ఇదే అని చెప్పాలి.
Also Read: పూజా హెగ్డే దెయ్యంగా మారితే... సూపర్ హిట్ హారర్ కామెడీ ఫ్రాంఛైజీలో బుట్టబొమ్మ పాత్ర అదేనా?
హీరో శ్రీ సింహ కోడూరి నటన, కమెడియన్లు సత్య, వెన్నెల కిషోర్ విపరీతంగా నవ్వించిన మత్తు వదలరా 2 సినిమాలో ఫరియా అబ్దుల్లా మెయిన్ రోల్ చేశారు. సీనియర్ కమెడియన్ సునీల్, నటి రోహిణి, జబర్దస్త్ రోహిణి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి కీరవాణి పెద్ద కుమారుడు శ్రీ సింహ అన్నయ్య కాలభైరవ ఇచ్చిన సంగీతం బలంగా నిలిచింది.