వైఎస్‌ఆర్‌సీపీకి భారీ షాక్ - మరో ఇద్దరు ఎమ్మెల్సీలు గుడ్ బై
ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి ఆ పార్టీ నేతలు వరుసగా గుడ్ బై చెబుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ,   బల్లి కల్యాణ్ చక్రవర్తి గుడ్ బై చెప్పారు. వీరిద్దరు ఏ పార్టీలో చేరుతారో అన్నదానిపై ప్రకటన చేయలేదు. వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేశారు. బల్లి కల్యాణ చక్రవర్తి నెల్లూరు కు చెందిన వారు. ఆయన మాజీ ఎంపీ బల్లి దర్గాప్రసాదరావు కుమారుడు. తిరుపతి ఎంపీగా ఉంటూ బల్లి దుర్గా ప్రసాదరావు చనిపోయారు. ఉపఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ దుర్గా ప్రసాదరావు కుటుంబానికి టిక్కెట్ కేటాయించలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


విచారణాధికారి ఎదుట కాదంబరి జత్వానీ హాజరు - తనకు ఎదురైన ఇబ్బందులు వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న నటి
ముంబయి నటి కాదంబరి జెత్వానీ (Kadambari Jethwani) కేసు విషయంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి జెత్వానీ శుక్రవారం విజయవాడకు (Vijayawada) వచ్చారు. మధ్యాహ్నం ఆమె పోలీస్ కమిషనర్‌ను కలిశారు. ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం.. జత్వానీ నుంచి వివరాలు తీసుకున్నారు. అత్యాచారం కేసు నుంచి అన్ని పరిణామాలను ఆమె వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


న్యాయవ్యవస్థపై అపారమైన నమ్మకం - సుప్రీంకోర్టు ఆగ్రహంతో రేవంత్ రెడ్డి వివరణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో  కవితకు బెయిల్ లభించిన అంశంపై రేవంత్ రెడ్డి చేసినట్లుగా ప్రచారమయిన వార్తలు కలకలం రేపాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. న్యాయవ్యవస్థపై తనకు అపారమైన నమ్మకం ఉందని..స్పష్టం చేశారు. కవితకు  బెయిల్ లభించిన తర్వాత తాను చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తున్నట్లుగా కొందరు ఆపాదించారని పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారణం వ్యక్తం చేస్తున్నానన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 
 


'ఆ మొక్కలు పెంచొద్దు' - వన మహోత్సవంలో పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతోన్న వన మహోత్సవం ఓ సామాజిక బాధ్యత అని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కళకళలాడాలని అన్నారు. 'దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు. అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రాంనగర్‌లో 'హైడ్రా' కూల్చివేతలు - ఫిర్యాదు చేసిన రెండ్రోజుల్లోనే చర్యలు
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై 'హైడ్రా' (HYDRA) కొరడా ఝలిపిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులకు సంబంధించిన అక్రమ భవనాలకు నోటీసులు ఇచ్చి కూల్చేసిన హైడ్రా అధికారులు మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రజల నుంచి వస్తోన్న ఫిర్యాదుల ఆధారంగానూ విచారించి అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్‌లో (Ram Nagar) అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి