Revanth Reddy explained that he has immense faith in the judiciary :   ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో  కవితకు బెయిల్ లభించిన అంశంపై రేవంత్ రెడ్డి చేసినట్లుగా ప్రచారమయిన వార్తలు కలకలం రేపాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. న్యాయవ్యవస్థపై తనకు అపారమైన నమ్మకం ఉందని..స్పష్టం చేశారు. కవితకు  బెయిల్ లభించిన తర్వాత తాను చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తున్నట్లుగా కొందరు ఆపాదించారని పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారణం వ్యక్తం చేస్తున్నానన్నారు. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల అపారమైన గౌరవం విశ్వాసం ఉన్నాయన్నారు. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసిస్తానని ఎప్పటికీ న్యాయవ్యవస్థను అత్యుత్తమనదిగానే భావిస్తానన్నారు. 



 గురువారం సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరిగిన సమయంమలో ధర్మాసనం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తాము పత్రికల్లో చూశామని తాము రాజకీయ నేతల్ని సంప్రదించి బెయిల్స్ ఇస్తామా అని ప్రశ్నించింది. ఓ బాధ్యాయుతమైన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలు కావని స్పష్టం చేసింది. బెయిల్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఆ సందర్భంగా  బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును బీజేపీకి బదిలీ చేసిందని.. అందుకే  కేవలం 5 నెలల్లో కవితకు బెయిల్ వచ్చిందని చెప్పుకొచ్చారు.  దే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకు 16 నెలల తర్వాత బెయిల్ వచ్చిందని.. కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నారన్నారు. కవితకు బెయిల్ రావడం పొలిటికల్ డీలేననన్నారు. 


రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో  హైలెట్ అయ్యాయి. జాతీయ మీడియా సైతం ప్రముఖంగా ప్రచురించింది.  దీంతో జస్టిస్ గవాయ్ ధర్మాసనం  మండిపడింది. ఓ బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలు కావని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టు వాఖ్యలతో.. తన మాటలపై విచారం వ్యక్తం చేశారు.                                            


న్యాయవ్యవస్థపై  రేవంత్ రెడ్డి నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. చిట్ చాట్ లో చేసిన  వ్యాఖ్యలనే  మీడియా ఎక్కువ చేసి ప్రచారం చేయడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జరిగిన డ్యామేజీని వెంటనే గుర్తించిన రేవంత్ రెడ్డి..   మరింత చర్చ జరగకుండా వెంటనే విచారం వ్యక్తం చేశారని..  న్యాయవ్యవస్థపై తన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారని అంటున్నారు.