Sri Venkateswara University: తిరుమల స్వామి వారు ఎంత ప్రాముఖ్యతో శ్రీవారి పాదాల చెంత కొలువైన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. రాయలసీమ పరిధిలో ఎస్వీ యూనివర్సిటీ కి ఉన్న ఖ్యాతి అద్బుతం అని చెప్పాలి. 1954 లో నాటి ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు టిటిడి సహకారంతో కొన్ని విభాగాలు మాత్రమే ప్రారంభించారు. యూనివర్సిటీ నిర్మాణాలు ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించడం రూపొందించారు. దేశ వ్యాప్తంగా చాలా తక్కువ విశ్వవిద్యాలయాలి ఉండగా తిరుపతి యూనివర్సిటీ చాల ప్రాచుర్యం కలిగింది. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం తో నిండిన వర్సిటీ ఎంతో మంది ప్రముఖుల, నాయకులు, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పలువురు ఇక్కడ విద్యాభ్యాసం చేసిన వారే. ఈ యూనివర్సిటీ కి న్యాక్ ర్యాంకింగ్ తో పాటు అనేక గుర్తింపులు ఉన్నాయి.


స్వామి వారి అనుగ్రహంతో చదవాలని


శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి పుణ్యక్షేత్రంలో విద్యా ను అభ్యసించాలని వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఆసక్తి చూపుతుంటారు. అది కూడా ఎస్వీయూ లో చదువుకోవాలని చాలా ఇష్టపడుతారు. ఇలాంటి విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఒక సువర్ణ అవకాశం కల్పించింది. తిరుపతి లో ప్రభుత్వ డిగ్రీ, పిజి కాలేజీ లు లేకపోవడంతో అందరు యూనివర్సిటీ లో లేదా టిటిడి కాలేజీలో చదవాలని ఉంటారు.


మెగా సప్లిమెంటరీ
ఎస్వీయూ పరిధిలో సుమారు 100కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం 5 వేలు నుంచి 7వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరూ ఎస్వీయూ అనుబంధం గా ఉన్న కళాశాలలు కావడంతో పరీక్షలు, ఫలితాలు అన్ని ఎస్వీయూ చూస్తుంటుంది. ప్రతి సంవత్సరం జరిగే పరీక్షలో చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అవుతుంచారు.. ఇలా ఫెయిల్ అయ్యి తిరిగి పరీక్షలు రాయకుండా, అప్పట్లో పరిస్థితి బాగోలేక పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం అరుదైన నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే మెగా సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ విడుదల.


1990-1991 సంవత్సరం నుంచి 2014-15 సంవత్సరం వరకు డిగ్రీ లోని ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల బీఏ, బీకాం, బీఎస్సీ, బీహెచ్ఎం, బీసీఎ, బీబీఏ, బీ.మ్యూజిక్, బీ డ్యాన్స్ తదితర కోర్సుల్లో ఫెయిల్ అయిన అభ్యర్థులు తిరిగి పరీక్షలు రాసే అవకాశం కల్పించింది. అధికారులు అంచనా ప్రకారం సుమారు 2000 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసే అవకాశం ఉందని భావిస్తున్నారు.


ముఖ్యమైన తేదీలు


పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ ( అదనపు ఫీజు లేకుండా) - 30.09.2024


అదనపు ఫీజు తో కలిపి చివరి తేదీ - 15.10.2024


ఫీజు వివరాలు 


ఒక పేపర్ రాయాలంటే- రూ. 2000
రెండు పేపర్లు రాయాలంటే- రూ. 3000
మూడు అంతకంటే ఎక్కువ పేపర్లు రాయాలంటే-రూ. 4000


ప్రాక్టికల్ పరీక్షలు రాయడానికి ( ఒక దానికి ) - రూ. 1500


15.10. 2024 వరకు అయితే - రూ. 1000


పరీక్షల వివరాలు, మెగా సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ వివరాల కోసం www.svunuversity.edu.inలో చూడొచ్చు.


Also Read: స్థానికులకు కేటాయించే అంగప్రదక్షిణ టికెట్లపై కీలక అప్‌డేట్- 500 డిపాజిట్ చేయాల్సిందే!