Tirumala News: తిరుమల, తిరుపతి అర్బన్, స్థానికులకు ప్రతి శనివారం కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టికెట్లు ఇకపై లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నట్లు టిటిడి ప్రకటించింది. అంగప్రదక్షిణ టికెట్లు కావలసిన స్థానిక భక్తులు ప్రతి గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ ఆధార్ కార్డుతో ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సాయంత్రం 5 గంటలకు లక్కీడిప్ ద్వారా వీళ్లకు టికెట్లు కేటాయిస్తారు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు ఇచ్చిన ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసిన మొబైల్ ఫోన్‌ నెంబర్లకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం అందిస్తారు. 


ఆన్ లైన్‌లో టికెట్లు
లక్కీడిప్‌లో టికెట్లు పొందిన స్థానిక భక్తులు ఆన్లైన్‌లో 500 రూపాయలను డిపాజిట్ చేయవలసి ఉంటుంది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు మహతి కళాక్షేత్రంలో తమ ఆధార్ కార్డు చూపి శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు అంగప్రదక్షిణ టికెట్లు పొందవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులను శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణకు అనుమతిస్తారు. అనంతరం భక్తులు చెల్లించిన రూ.500 డిపాజిట్‌ను తిరిగి వారి ఖాతాల్లోకి టీటీడీ జమ చేస్తుంది. 


Also Read: ఈ ఆలయంలో తప్పుడు ప్రమాణం చేస్తే.. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు!


తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులు కానీ భక్తులు ఎవరైనా టీటీడీని మోసం చేసి లక్కీ డిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు పొందితే వారు చెల్లించిన రూ.500 డిపాజిట్ టీటీడీ తిరిగి చెల్లించదు. అంగప్రదక్షిణకి కూడా అనుమతించరు. తిరుమల, తిరుపతి స్థానికులు ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. 



పూర్వ వైభవం ఎప్పటి నుంచి
తిరుమల తిరుపతి స్థానికులకు ప్రతినెల రెండో మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం స్థానికులకు ఇది ఒక వరంగా భావించే వారు. ఈ సదుపాయాన్ని గత ప్రభుత్వం కొవిడ్ సమయంలో నిలిపి వేసింది. ఆ పరిస్థితుల నుంచి బయటపడిన తిరిగి స్థానికులకు కల్పించే స్వామి వారి దర్శనం తిరిగి ప్రారంభించలేదు. అదే అజెండాను కూటమి ప్రభుత్వం తరపున పోటీ చేసిన తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రత్యేకంగా ప్రతి సమావేశంలో తాను స్థానికులకు ప్రతి నెల దర్శనం కల్పించే అవకాశం ఇస్తామని తెలిపారు. కొత్తగా ఈవో శ్యామలారావు వచ్చిన వెంటనే ఆయనను కలిసి మాట్లాడుతామని కూడా ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తున్న ఇప్పటివరకు పట్టించుకోలేదు. వెంటనే ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు. 


Also Read: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం - ఆ ప్రచారంపై టీటీడీ క్లారిటీ, భక్తులు అపోహలు నమ్మొద్దని విజ్ఞప్తి


రూ.3.70 కోట్లు విరాళం
టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.3.70 కోట్లు విరాళంగా అందింది. హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఎస్‌ బ్రదర్స్ మేనేజింగ్‌ డైరెక్టర్లు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాద రావు, మాలతీ లక్ష్మీ కుమారి బుధవారం ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.3.70 కోట్లు విరాళంగా అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి దాతలు విరాళం చెక్కును అందజేశారు.



Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!