India Got Off To A Good Start As Para Archer Sheetal Devi Excelled Beyond Expectations: పారా ఒలింపిక్స్‌(2024 Paralympics)లో భారత(India) పోరాటం ఆరంభమైంది. శీతల్‌ దేవి(Sheetal Devi) అద్భుతం చేయడంతో తొలి రోజు భారత్‌ సంతృప్తికరంగానే ముగించింది. ఇక ఇవాళ భారత ఖాతాలో తొలి పతకం చేరే అవకాశం కనిపిస్తోంది. పారా ఒలింపిక్స్‌లో తొలిరోజు భారత ఆర్చర్‌ శీతల్‌ దేవీ.. షట్లర్లు సుకాంత్, సుహాస్, తరుణ్‌ శుభారంభం చేశారు. శీతల్‌ దేవీ ప్రదర్శనే తొలి రోజు హైలెట్‌గా నిలిచింది. తొలిసారి పారా ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన శీతల్‌ రెండు చేతులు లేకోపోయినా కాళ్లతో గురి పెట్టి లక్ష్యాన్ని ఛేదించారు. శీతల్‌ పట్టుదల ముందు ప్రపంచ రికార్డు ఆమె పాదాక్రాంతమైంది. ఇక నేరుగా ప్రీ క్వార్టర్స్‌కు చేరిన శీతల్‌ దేవి... పతక ఆశలను రెట్టింపు చేసింది. కాలితో విల్లును పట్టి, భుజంతో బాణాలు విసిరే శీతల్‌ పారాలింపిక్స్‌లో తన ప్రదర్శనతో అద్భుతమే చేసింది.


Read Also:  Virat Kohli : గిల్‌ నన్ను ఎప్పటికీ దాటలేడు, కోహ్లీ డీప్‌ ఫేక్‌ వీడియో వైరల్‌


 






 

శీతల్ గురి తప్పలేదు 

భారత చెందిన ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి పారా ఒలింపిక్స్‌ అరంగేట్రంలోనే అదరగొట్టింది. తాను గురి పెడితే ఎలాంటి లక్ష్యమైనా ఛేదించాల్సిందేనని చాటి చెప్పింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్‌లో శీతల్‌ రెండో స్థానంలో నిలిచి నేరుగా ప్రీ క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. పారిస్ పారాలింపిక్స్‌లో 16వ రౌండ్‌లోకి నేరుగా ప్రవేశించి పతక ఆశలను శీతల్‌ రెట్టింపు చేసింది. శీతల్ 720కి 703 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. టర్నీకు చెందిన ఒజ్నూర్ కేవలం ఒకే పాయింట్‌తో   704 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ప్రపంచ రికార్డు సృష్టించింది. పారిస్‌ పారా ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం గెలుస్తుందనే అంచనాలున్న శీతల్‌.. ర్యాంకింగ్‌ రౌండ్లో ఉత్తమ ప్రదర్శనతో అంచనాలు పెంచేసింది. మరోవైపు షట్లర్లు సుకాంత్, సుహాస్, తరుణ్‌ కూడా తొలి మ్యాచ్‌లో విజయం సాధించారు. పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌4 విభాగంలో సుకాంత్‌ 17-21, 21-15, 22-20 తేడాతో మలేషియాకు చెందిన అమిన్‌పై ఘన విజయం సాధించాడు. బ్రెజిల్‌కు చెందిన జేవియర్‌పై తరుణ్‌ 21-17, 21-19తో పోరాడి విజయం సాధించారు. గ్రూప్‌-ఏలో 21-7, 21-5తో ఇండోనేషియాకు చెందిన హిక్మత్‌పై సుహాస్‌ ఏక పక్ష విజయం సాధించాడు. గ్రూప్‌-ఏలో నితేశ్‌ కుమార్‌  మనోజ్‌ సర్కార్‌పై విజయం సాధించాడు. 

 

నేటి భారత షెడ్యూల్‌ ఇదే

షూటింగ్‌: మహిళల 10మీ.ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1 క్వాలిఫికేషన్‌ మధ్యాహ్నం 12.30, ఫైనల్‌- మధ్యాహ్నం 3.15

పురుషుల 10మీ.ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 క్వాలిఫికేషన్‌ (రుద్రాన్ష్, మనీశ్‌)

మధ్యాహ్నం 2.45, ఫైనల్‌- సాయంత్రం 5.30

మిక్స్‌డ్‌ 10మీ.ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌2 క్వాలిఫికేషన్‌ (శ్రీహర్ష)- సాయంత్రం 5, ఫైనల్‌- రాత్రి 7.45