Paralympics 2024: గత రికార్డులను చెరిపేసేలా, నవ చరిత్ర లిఖించేలా భారత పారా అథ్లెట్లు సిద్ధం
Paris Paralympics 2024 : దేశవిదేశ క్రీడాకారులు, క్రీడా అభిమానులతో పారాలింపిక్స్ 2024 పారిస్ లో అట్టహాసంగా ప్రారంభమైందిసాంప్రదాయ దుస్తులతో మెరిసిన మన పారాఅథ్లెట్లు సత్తా చాటడానికి సిద్ధమయ్యారు.

Paris Paralympics India schedule Day 1: పారిస్ పారా ఒలింపిక్స్(Paris Paralympics)లో భారత్(India) 84 మంది అథ్లెట్లతో బరిలోకి దిగనుంది. ఆరంభ వేడుకల్లో సాంప్రదాయ దుస్తులతో మెరిసిన పారా అథ్లెట్లు ఇక సత్తా చాటి పతకాలను ఒడిసి పట్టేందుకు సిద్ధమైపోయారు. ఈసారి టార్గెట్ 25 లక్ష్యంతో పారా అథ్లెట్లు బరిలో దిగుతున్నారు. పారా ఒలింపిక్స్‌లో 12 క్రీడా విభాగాల్లో 84 మంది భారత అథ్లెట్లు తమ ప్రతిభను చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన పతకాల కంటే ఎక్కువ సాధించాలన్న సంకల్పంతో భారత అథ్లెట్లు ఉన్నారు. సుమిత్ యాంటిల్, అవనీ లేఖరా, మనీష్ నర్వాల్, కృష్ణ మరోసారి పతకం సాధించాలని గట్టి పట్టుదలగా ఉన్నారు.
ప్రముఖుల శుభాకాంక్షలు
భారత పారా అథ్లెట్ల బృందానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పారా అథ్లెట్లు సత్తా చాటాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. పారాలింపిక్స్‌లో మన అథ్లెట్ల బృందం ఉత్తమ ప్రదర్శన చేయాలని 140 కోట్ల భారతీయులు ఆకాంక్షిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి ఒక్క అథ్లెట్ ధైర్యం, సంకల్పమే దేశం మొత్తానికి స్ఫూర్తి వనరని మోదీ పేర్కొన్నారు. పారా ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారత అథ్లెట్ల బృందానికి పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ విజేత, జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా బెస్టాఫ్ లక్ చెప్పాడు.
ఇవాళ్టీ భారత షెడ్యూల్ ఇదే
బ్యాడ్మింటన్
మిక్స్‌డ్ డబుల్స్ గ్రూప్ స్టేజ్ మధ్యాహ్నం 12:00 గంటలకు
పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ మధ్యాహ్నం 12:00 గంటలకు
మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ మధ్యాహ్నం 12:00 గంటలకు
పారా స్విమ్మింగ్
పురుషుల 50మీ ఫ్రీస్టైల్ S10 మధ్యాహ్నం 1:00 గంటలకు
టేబుల్ టెన్నిస్
మహిళల డబుల్స్ మధ్యాహ్నం 1:30 గంటలకు
పురుషుల డబుల్స్ మధ్యాహ్నం 1:30 గంటలకు
మిక్స్‌డ్ డబుల్స్ మధ్యాహ్నం 1:30 గంటల నుంచి
పారా-టైక్వాండో
మహిళల K4447kg మధ్యాహ్నం 1:30 నుంచి
పారా షూటింగ్:
మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ప్రివెంట్ మధ్యాహ్నం 2:30
మిక్స్‌డ్ 10మీ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH2 ప్రివెంట్ ట్రైనింగ్ 4:00 pm
పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ SH1 ప్రివెంట్ శిక్షణ సాయంత్రం 5:45
పారా సైక్లింగ్
మహిళల C13 3000m వ్యక్తిగత పర్స్యూట్ క్వాలిఫైయింగ్ 4:25 pm
పారా ఆర్చరీ:
మహిళల వ్యక్తిగత ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్ 4:30 pm
పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్ 4:30 pm
పురుషుల వ్యక్తిగత ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్ 8:30 pm
మహిళల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్ 8:30 pm