News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

బీజేపీ యుద్ధానికి ప్రతిపక్షాలే స్వయంగా అస్త్రాలు అందిస్తున్నాయా? కమల దళానికి అదే కలిసొస్తోందా?

Lok Sabha Election: బీజేపీకి ప్రతిపక్షాలే ఎన్నికల అస్త్రాలు సిద్ధం చేసుకునేందుకు సహకరిస్తున్నాయా?

FOLLOW US: 
Share:

Lok Sabha Election:


ఎన్నికల హడావుడి మొదలు..

లోక్‌సభ ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు. గ్రౌండ్‌ లెవెల్‌లో ఇప్పటికే అన్ని పార్టీలూ సిద్ధమైపోయాయి. ఎన్నికల నోటిఫికేషన్‌లు విడుదల కాకముందే ప్రచారం మొదలు పెట్టాయి. పైగా జమిలి ఎన్నికల హడావిడి ఉండడం వల్ల ఇంకాస్త ఎక్కువగా ఫోకస్ పెట్టాయి పార్టీలు. మోదీ సర్కార్‌ని గద్దె దించాలని I.N.D.I.A కూటమి వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. అటు మోదీ సర్కార్ మాత్రం కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనే స్థాయిలో దూసుకుపోతోంది. సరిగ్గా ఎన్నికల ముందే ఒక్కో అస్త్రం బయటకు తీస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్‌ కూడా అందులో ఒకటి. దాదాపు 3 దశాబ్దాలుగా పార్లమెంట్‌లో ఈ  బిల్‌పై (Women Reservation Bill) సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. కానీ...ఈ సారి కచ్చితంగా ఆమోదించుకోవాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. మహిళలకు సంబంధించిన విషయం కనుక...ప్రతిపక్షాలూ పెద్దగా అభ్యంతరాలు తెలిపే అవకాశముండకపోవచ్చు. పైగా...బీజేపీకి గట్టి మెజార్టీ ఉంది. ఎవరైనా ఈ బిల్‌ని వ్యతిరేకిస్తే...సింపుల్‌గా "మహిళ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు" అని స్టేట్‌మెంట్‌ ఇచ్చి ఆ పార్టీ సెల్ఫ్‌ డిఫెన్స్‌లో పడేయొచ్చు. అందుకే...చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది కాషాయ పార్టీ. కచ్చితంగా బిల్ పాస్ అవుతుందని భావిస్తోంది. అయితే...బిల్ పాస్ అయ్యాక అది అమల్లోకి వచ్చి మహిళలకు రిజర్వేషన్‌లు దక్కడానికి ఎన్ని రోజులు పడుతుందో స్పష్టంగా చెప్పలేకపోయినా...మోదీ సర్కార్ ఖాతాలోనే పడుతుంది. ఎటు చూసినా కేంద్ర ప్రభుత్వానికి ఇది కలిసొస్తుంది. 

మహిళా రిజర్వేషన్ అస్త్రం..

నిజానికి...మహిళా రిజర్వేషన్ బిల్‌ గురించి ఈ మధ్య ప్రతిపక్షాలు నినదించాయి. BRS కి చెందిన కల్వకుంట్ల కవిత ఢిల్లీలో దీక్ష కూడా చేశారు. పలు పార్టీలూ మద్దతు తెలిపాయి. అంటే...బీజేపీకి ఈ అస్త్రాన్ని ప్రతిపక్షాలే అందించినట్టు లెక్క. పోరాటం చేసినందుకే తీసుకొచ్చారు అని ప్రతిపక్షాలు చెప్పుకున్నా....ఆ వాదనకు పెద్దగా వెయిటేజ్ ఉండదు. 27 ఏళ్లుగా లేనిది తమ ప్రభుత్వం చేసి చూపించిందని బీజేపీ మొత్తం క్రెడిట్‌ని తీసుకుంటుందన్నది కాదనలేని నిజం. ఈ ఒక్క బిల్‌ విషయంలోనే కాదు. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న ప్రతి అంశాన్నీ తమకు అనుకూలంగా మలుచుకుని, వాటినే అస్త్రాలుగా చేసి ప్రయోగిస్తోంది BJP. ఒక్క దెబ్బతో మొత్తం అపొజిషన్‌ని సైలెంట్‌గా ఉంచేస్తోంది. జమ్ముకశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రద్దు (Article 370 Abolition) విషయంలోనూ ఇదే జరిగింది. ఈ ఆర్టికల్‌ని రద్దు చేస్తే తప్ప కశ్మీర్‌ బాగు పడదని చాలా గట్టిగా వాదించింది కేంద్రం. ఆ నిర్ణయమూ తీసేసుకుంది. కశ్మీర్‌లోని పార్టీలు, కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలు పెద్దగా దీనిపై వాదులాడలేదు. అందుకు కారణం బీజేపీ మైండ్‌గేమ్. "ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తున్నాం" అని ప్రచారం చేసుకోవడం, అన్నట్టుగానే చేయడం వల్ల వాటిని వ్యతిరేకించేందుకు పార్టీలు ముందుకు రావడం లేదు. ఒకవేళ వ్యతిరేకించినా వాళ్లకు పెద్దగా మద్దతూ లభించడం లేదు. క్రమంగా ఈ ఇష్యూ డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఎన్నికలకూ సిద్ధమవుతున్నారు. 

అయోధ్య రామ మందిరం..

ఆ తరవాత అయోధ్య రామ మందిర నిర్మాణం సంచలనం సృష్టించింది. గత ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఈ సమస్య ఇన్నాళ్లూ పరిష్కారం కాలేదని బీజేపీ తేల్చి చెప్పింది. ఎంతో సంక్లిష్టమైన ఆ సమస్యను సులువుగా పరిష్కరించే మార్గాలు అన్వేషించింది. మొత్తానికి అది సాధించి నిర్మాణాన్నీ పూర్తి చేసే వరకూ వచ్చింది. "రామ మందిరం కడతారేమో..కానీ ఎప్పుడు కడతారో క్లారిటీ ఉండదు" ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యల్ని ఇప్పటికీ ప్రస్తావిస్తోంది బీజేపీ. వాళ్లు అలా కించపరిచారని, అయినా తాము కట్టి చూపించామని చాలా గట్టిగా వాదిస్తోంది. ఫలితంగా...ప్రతిపక్షాలకు దీనిపైనా పోరాడే అవకాశం లేకుండా పోయింది. అంటే...వాళ్లు బీజేపీని ఏయే అస్త్రాలతో యుద్ధం చేయాలనుకున్నారో..వాటినే తమకు అనుకూలంగా మలుచుకుంది కాషాయ పార్టీ. "7 దశాబ్దాల్లో చేయలేని అభివృద్ధిని 9 ఏళ్లలో చేసి చూపించాం" అని అంత ధీమాగా చెప్పుకోడానికి కారణమూ ఇదే. ఇవి కాకుండా జమిలి ఎన్నికల విషయంలోనూ కాస్త గట్టి పట్టుదలతోనే ఉంది కేంద్రం. UCC(Uniform Civil Code)బిల్‌నీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇలా ఒకేసారి అన్నింటినీ బయటకు తీసి ప్రతిపక్షాలు ఊపిరి పీల్చుకోకుండా చేస్తోంది. ఓ ఇష్యూపై పోరాడుతుండగానే మరోటి తీసుకొస్తోంది. ఫలితంగా అపొజిషన్ పార్టీలకు వీటిని ఎదుర్కోడానికే సమయం సరిపోతోంది తప్ప పూర్తి స్థాయిలో ఎన్నికల వ్యూహంపై దృష్టి పెట్టే అవకాశమే ఇవ్వడం లేదు బీజేపీ

Also Read: మహిళా రిజర్వేషన్ బిల్లులో ఏముంది ? ఫలాలు అందాలంటే కొన్నేళ్లు ఆగాల్సిందేనా ?

Published at : 20 Sep 2023 11:02 AM (IST) Tags: Lok Sabha Election 2024 Ayodhya Ram Mandir Lok Sabha Election Women Reservation Bill Opposition Parties BJP Strategies BJP Speed Up

ఇవి కూడా చూడండి

IDBI Jobs: ఐడీబీఐ బ్యాంకులో 86 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా

IDBI Jobs: ఐడీబీఐ బ్యాంకులో 86 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా

ISRO Projects in 2024: ఇకపై SSLV రాకెట్‌తో ఇస్రో మరిన్ని ప్రయోగాలు, రాజ్యసభలో కేంద్రం వెల్లడి

ISRO Projects in 2024: ఇకపై SSLV రాకెట్‌తో ఇస్రో మరిన్ని ప్రయోగాలు, రాజ్యసభలో కేంద్రం వెల్లడి

AIIMS Bibinagar: బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో 40 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు, వివరాలు ఇలా

AIIMS Bibinagar: బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో 40 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు, వివరాలు ఇలా

SBI Clerks Recruitment: ఎస్‌బీఐ క్లర్క్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

SBI Clerks Recruitment: ఎస్‌బీఐ క్లర్క్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

Live-in relationship: సహజీవనం, ప్రేమ పెళ్లిలను నిషేధించేలా చట్టం చేయాలి - లోక్‌సభలో బీజేపీ ఎంపీ డిమాండ్‌

Live-in relationship: సహజీవనం, ప్రేమ పెళ్లిలను నిషేధించేలా చట్టం చేయాలి - లోక్‌సభలో బీజేపీ ఎంపీ డిమాండ్‌

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?