పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే.. మహిళల సాధికారత కోసం.. ప్రత్యేక పథకాలు తీసుకోస్తామని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అంతేగాకుండా.. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి నెలా.. రూ.వెయ్యి ఇస్తామని చెప్పారు. పంజాబ్ లో పర్యటించిన ఆయన ఈ మేరకు ప్రకటించారు.
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే.. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1000 రూపాయల చొప్పున ఇస్తామని.. అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వచ్చే సంవత్సరం అసెంబ్లీలో ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో పర్యటించారు. అక్కడ మహిళా సాధికారత కోసం ప్రత్యేక పథకాలను తీసుకోస్తామని చెప్పారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు చెప్పారు. పంజాబ్‌వ్యాప్తంగా ఉచితంగా వైద్య సదుపాయలను కల్పిస్తామని అన్నారు.
ఆప్ ఇచ్చిన వాగ్దానంతో పంజాబ్‌లోని కోటి మందికి పైగా మహిళల జీవితాలపై ప్రభావం చూపుతుందని, తమ పార్టీకి గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉందని ఆ పార్టీ ప్రణాళికలు వేసుకుంటోంది. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం దక్కుతుందని ఆప్ ఆశించింది. కానీ ఓటమి చవిచూసింది. మెుత్తం 11 మంది సిట్టింగ్.. ఎమ్మెల్యేలతో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను ఆప్ ప్రకటించింది. అయితే ఇప్పటి వరకూ ఆప్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు.
Also Read: Farmers Protest: నవంబర్ 29న రైతుల 'చలో పార్లమెంట్'.. మోదీ సర్కార్‌కు తప్పని నిరసన సెగ
Also Read: Abhinandan Awarded Vir Chakra: పాక్‌ను వణికించిన కమాండర్ అభినందన్‌కు 'వీర చక్ర'
Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 249 మంది మృతి
Also Read: షాకింగ్ అధ్యయనం... గర్భస్థ శిశువుకు ప్రాణాంతకంగా మారిన ఆ వేరియంట్, ప్రసవ సమయాల్లో పెరిగిన మరణాలు