కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలో ఉద్యోగులకు శుభవార్త అందనుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు, పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదనను ఆర్థిక సలహా కమిటీ ప్రధానమంత్రికి పంపింది.
కమిటీ ప్రతిపాదన ప్రకారం.. భారత్ లోని వ్యక్తులకు పని చేసే వయసు పరిమితి పెంచడంపై చర్చ జరిగింది. పదవీ విరమణతోపాటుగా పెన్షన్ కూడా పెంచాలని.. ఆర్థిక సలహా కమిటీ తెలిపింది. ఈ మేరకు యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్ ను ప్రారంభించేలా ప్రణాళికలు చేస్తున్నారు. కమిటీ నివేదిక ప్రకారం.. ప్రతి నెల కనీసం 2000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. దేశంలోని సీనియర్ సిటిజన్ల భద్రత కోసం మెరుగైన ఏర్పాట్లను కమిటీ సిఫార్సు చేసింది.
పదవీ విరమణ వయస్సును పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. సామాజిక భద్రతా వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల నైపుణ్యాభివృద్ధి గురించి కూడా నివేదికలో ప్రస్తావించారు.
నైపుణ్యాభివృద్ధికి వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలను రూపొందించాలని నివేదికలో పేర్కొన్నారు. ఇందులో అసంఘటిత రంగంలోని వారు, మారుమూల ప్రాంతాలు, శరణార్థులు, శిక్షణ పొందే స్తోమత లేని వలసదారులు కూడా ఉండాలని కమిటీ చెప్పింది. అయితే వారికి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలని నివేదికలో స్పష్టం చేసింది.
ప్రపంచ జనాభా అవకాశాలు 2019 ప్రకారం.. 2050 నాటికి భారతదేశంలో దాదాపు 32 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఉంటారు. అంటే దేశ జనాభాలో దాదాపు 19.5 శాతం మంది రిటైర్డ్ కేటగిరీలోకి వెళ్తారు. 2019 సంవత్సరంలో, భారతదేశ జనాభాలో 10 శాతం.. సీనియర్ సిటిజన్ల కేటగిరీలో ఉన్నారు.
Also Read: Farmers Protest: నవంబర్ 29న రైతుల 'చలో పార్లమెంట్'.. మోదీ సర్కార్‌కు తప్పని నిరసన సెగ
Also Read: Abhinandan Awarded Vir Chakra: పాక్‌ను వణికించిన కమాండర్ అభినందన్‌కు 'వీర చక్ర'
Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 249 మంది మృతి
Also Read: షాకింగ్ అధ్యయనం... గర్భస్థ శిశువుకు ప్రాణాంతకంగా మారిన ఆ వేరియంట్, ప్రసవ సమయాల్లో పెరిగిన మరణాలు