అన్వేషించండి

త్వరలోనే కశ్మీర్‌లోనూ వందేభారత్ రైళ్ల పరుగులు, రైల్వే మంత్రి ఆసక్తికర ప్రకటన

Vande Bharat Trains: త్వరలోనే కశ్మీర్‌లోనూ వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తాయని రైల్వే మంత్రి ప్రకటించారు.

Vande Bharat Trains:

కశ్మీర్‌లోనూ వందేభారత్..

కశ్మీర్‌లోనూ త్వరలోనే వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains in Kashmir) అందుబాటులోకి రానున్నాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇదే విషయం వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా జమ్ము -శ్రీనగర్‌ లైన్‌లో వందేభారత్‌ ట్రైన్‌ సర్వీస్‌లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోనూ సెమీ హై స్పీడ్‌ ట్రైన్స్‌ని నడిపే యోచనలో ఉన్నట్టు స్పష్టం చేశారు. ఆ రాష్ట్రానికి రైల్వే లైన్‌ కన్‌ఫమ్ కాగానే వెంటనే ఈ ట్రైన్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 75 వందేభారత్ రైళ్లను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకి ప్రత్యామ్నాయంగా వందేభారత్ స్లీపర్ ట్రైన్స్‌నీ అందుబాటులోకి తీసుకురానుంది. జమ్ము-శ్రీనగర్ రైల్వే లైన్ క్లియర్ అయిన వెంటనే వందేభార్ ట్రైన్‌ని నడుపుతామని స్పష్టం చేశారు అశ్విని వైష్ణవ్. ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఇది పూర్తవుతుందని చెప్పారు. కశ్మీర్‌లోని వాతావరణానికి తగ్గట్టుగా రైళ్లని డిజైన్ చేస్తామని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే యువత, వృద్ధుల్లో వందేభారత్ ట్రైన్‌కి మంచి పాపులారిటీ వచ్చింది. అందుకే..ఇకపైనా వీటి సంఖ్య పెంచాలని భావిస్తోంది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఈ రైళ్లు అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. 

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌కి కాషాయ రంగు వేయడాన్ని రాజకీయం చేయొద్దని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తేల్చి చెప్పారు. కాషాయ రంగువేయడం వెనక ఏదైనా రాజకీయ కారణం ఉందా అన్న మీడియా ప్రశ్నలకు ఈ సమాధానమిచ్చారు. కేవలం శాస్త్రీయంగా ఆలోచించి ఈ రంగు వేశామే తప్ప..రాజకీయ ఉద్దేశాలేమీ లేవని స్పష్టం చేశారు. కంటికి బాగా కనిపించే రంగు కావడం వల్లే ఆరెంజ్ కలర్‌ని ఎంపిక చేసినట్టు వివరించారు. కేరళలో సెప్టెంబర్ 24వ తేదీన కసరగడ్ నుంచి తిరువనంతపురం వరకూ కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వచ్చింది. కాషాయ రంగులో ఉన్న ట్రైన్‌ అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఒకేసారి 9 వందేభారత్ ట్రైన్స్‌ని ప్రారంభించారు. అయితే...ఆరెంజ్ కలర్ వేయడంపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్న వాళ్లూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్‌లు పెట్టారు. పార్టీ రంగునే ట్రైన్‌లకు వేసుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అందుకే...అశ్వినీ వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లు, షిప్స్‌లో కీలకంగా భావించే black box లకూ ఆరెంజ్ కలర్ వేస్తారని, అవి చాలా క్లియర్‌గా కనిపిస్తాయన్న కారణంతోనే అలా తయారు చేస్తారని వివరించారు. 

"వందేభారత్ ట్రైన్స్‌కి కాషాయ రంగు వేయడాన్ని రాజకీయం చేయొద్దు. ఇది 100 సైంటిఫిక్‌గా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. సాధారణంగా మన కళ్లకి పసుపు, కాషాయ రంగుల విజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఐరోపాలో దాదాపు 80% రైళ్లకి ఆరెంజ్, ఎల్లో కాంబినేషన్‌ రంగులనే వేస్తారు. ఎల్లో ఆరెంజ్ లాగే సిల్వర్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది.

- అశ్వినీ వైష్ణవ్, కేంద్ర రైల్వే మంత్రి

Also Read: నా బాల్యమంతా రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే గడిచింది - ప్రధాని మోదీ భావోద్వేగం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget