By: ABP Desam | Updated at : 16 Mar 2022 01:44 PM (IST)
Edited By: Murali Krishna
హోలీ తర్వాతే మళ్లీ హిజాబ్- అత్యవసర విచారణకు సుప్రీం నో
విద్యాసంస్థల్లో హిజాబ్ బ్యాన్‌ను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను సుప్రీం కోర్టు స్వీకరించింది. అయితే అత్యవసర విచారణకు మాత్రం అంగీకరించలేదు. హోలీ సెలవుల తర్వాత ఈ పిటిషన్‌లపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
Koo AppThe SC declined to grant an urgent hearing on a plea challenging #Karnataka HC order, which dismissed all petitions seeking direction for permission to wear hijab in classrooms & held that wearing of #Hijab by Muslim women does not form a part of essential religious practice. - IANS (@IANS) 16 Mar 2022
వ్యాజ్యాలపై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషన్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే కోరారు. త్వరలో పరీక్షలు ఉన్న కారణంగా సత్వరమే విచారణ జరపాలని అభ్యర్థించారు. అయితే, సీజేఐ ధర్మాసనం అందుకు నిరాకరించింది. సెలవుల తర్వాతే కేసును విచారణకు స్వీకరిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. దీనిపై తమకు కొంత సమయం కావాలని వ్యాఖ్యానించారు.
హై కోర్టు తీర్పు
కొన్ని నెలలకు ముందు కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది.
మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్' నినాదాలతో ర్యాలీలు చేశారు. దీంతో ఈ వివాదం దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.
కోర్టుకు
హైకోర్టు ఫుల్ బెంచ్ ఫిబ్రవరి 10న హిజాబ్ పిటిషన్‌లపై విచారణను ప్రారంభించింది. రెండు వారాల పాటు వాదనలు విన్న హైకోర్టు ఫిబ్రవరి 25వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. అంతలో పాఠశాల, కళాశాల క్యాంపస్‌లలో హిజాబ్‌ను నిషేధించాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఎట్టకేలకు కర్ణాటక హైకోర్టు.. హిజాబ్ ధరించడం ఇస్లాం ప్రకారం తప్పనిసరి మతాచారం కాదని మంగళవారం తీర్పు ఇచ్చింది.
Rahul Vs S Jaishankar : అది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం - రాహుల్‌గాంధీకి విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ !
Gyanvapi Mosque Row: 'జ్ఞానవాపి'పై సుప్రీం విచారణ- మసీదుకు ఒక్కసారిగా 700 మంది ముస్లింలు!
Gyanvapi mosque case: 'జ్ఞానవాపి మసీదు'పై సుప్రీం కీలక ఆదేశాలు- కేసు వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ
Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?
Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి
Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !
BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత
Thailand Open: ప్చ్.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!
Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !