Tamil Nadu CM Stalin: 'గాడ్సే మార్గం వద్దు- గాంధీ, అంబేద్కర్, పెరియార్ దారిలో వెళ్లండి' విద్యార్థులకు తమిళనాడు సీఎం స్టాలిన్ సూచన
Tamil Nadu CM Stalin: విద్య మాత్రమే శాశ్వతమైన ఆస్తి అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అభిప్రాయపడ్డారు. తమిళనాడు సమిష్టి పురోగతికి పునాది తెలిపారు.

Tamil Nadu CM Stalin: విభజన సిద్ధాంతాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం విద్యార్థులకు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ వంటి నాయకులు చూపిన సమ్మిళిత, సంస్కరణవాద మార్గాలు అనుసరించాలని సూచించారు. తిరుచిరాపల్లిలోని జమాల్ మొహమ్మద్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న స్టాలిన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. యువతలో రాజకీయ అవగాహన, ఐక్యత ప్రాముఖ్యతను స్టాలిన్ నొక్కి చెప్పారు.
'గాడ్సే శిబిరం మార్గంలో ఎప్పుడూ వెళ్లవద్దు': స్టాలిన్
స్టాలిన్ ఏమన్నారంటే "మనకు అనేక మార్గాలు ఉన్నాయి; గాంధీజీ, డాక్టర్ అంబేద్కర్, పెరియార్ చూపిన మార్గం మంచిది. మీరు గాడ్సే శిబిరం మార్గంలో ఎప్పుడూ వెళ్లొద్దు." అని మహాత్మా గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సేను ప్రస్తావించాయి.
Addressing college students in Tiruchirappalli, Tamil Nadu CM MK Stalin says, "Students must unite with the spirit of ‘One Tamil Nadu’ to protect the state. I will be your steadfast supporter in that cause,...The DMK will always be a movement that protects the rights of Muslims.… https://t.co/GySslg83To
— ANI (@ANI) July 9, 2025
విద్య విలువను ముఖ్యమంత్రి స్టాలిన్ నొక్కిచెప్పారు, విద్య "శాశ్వత ఆస్తి" తమిళనాడు సమిష్టి పురోగతికి పునాది అని అభిప్రాయపడ్డారు. "మనం ఒకే తమిళనాడుగా ఐక్యంగా నిలబడితే, ఏ శక్తి మనల్ని ఓడించదు" అని ఆయన అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాల కోసం విద్యార్థులు కలిసి రావాలని కోరారు.
స్లాటిన్ తన సందేశంలో రాజకీయాలకు స్థానం లేదని కూడా స్పష్టం చేశారు. “నేను రాజకీయాలు మాట్లాడటం లేదు” అని అన్నారు.
ఈ సందర్భంగా ముస్లిం సమాజానికి భరోసా ఇచ్చారు ఆ దిశగా బలమైన మెసేజ్ ఇచ్చారు. మైనారిటీ హక్కులను పరిరక్షించడంలో డిఎంకె నిబద్ధతను పునరుద్ఘాటించారు. "రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి విద్యార్థులు 'ఒకే తమిళనాడు' స్ఫూర్తితో ఐక్యంగా ఉండాలి. ఆ లక్ష్యంతోనే నేను గట్టి మద్దతుదారునిగా ఉంటాను, డిఎంకె ఎల్లప్పుడూ ముస్లింల హక్కులను పరిరక్షించే ఉద్యమంగా ఉంటుంది. అది మీకు నేను ఇస్తున్న వాగ్దానం" అని ఆయన అన్నారు.
తిరుచిరాపల్లిలోని జమాల్ మొహమ్మద్ కళాశాల ప్లాటినం వేడుకల్లో భాగంగా జరిగిన గ్లోబల్ జమాలియన్స్ బ్లాక్ ప్రారంభోత్సవం సందర్భంగా స్టాలిన్ మాట్లాడారు.





















