Andhra Pradesh News Telangana Updates Today - విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్‌కు స్వల్ప ఊరట - జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశం |  కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్ల కాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేసేందుకు నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ గా ఉంటూ ప్రెస్ మీట్ ఎలా పెడతారని..తన అభిప్రాయాల్ని ఎలా వెలిబుచ్చాతారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా.. నిష్పక్షపాతంగా ఉండాలన్నారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ గా మరొక జడ్జిని నియమించాలని సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


US ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ సతీమణి తెలుగింటి అమ్మాయే - ఎవరీ ఉష చిలుకూరి?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంచనాలన్నీ నిజమైతే ఓ తెలుగింటి అమ్మాయి.. ఆ దేశ రెండో మహిళగా నిలుస్తారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన జె.డి.వాన్స్ (JD Vance) భార్య, ఉషా చిలుకూరి వాన్స్ (Usha Chilukuri Vance) తెలుగు మూలాలున్న మహిళ. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, వాన్స్ పేరు ప్రకటించగానే.. ఆయన భార్య ఉష గురించి కూడా ఎక్కువగా చర్చిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం, అధికారిక ప్రకటన
ఏపీలో మహిళలకు ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Service) అమలు తేదీపై అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అమలు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న ప్రభుత్వం తాజాగా ఈ శుభవార్త అందించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రైతు రుణమాఫీ జీవోపై రేవంత్ ప్రభుత్వాన్ని అభినందించిన వెంకయ్య
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ అభినందినీయమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రైతు రుణమాఫీ జీవోను తెలుగులో జారీ చేయడంపై ఆయన ఎక్స్‌(X) వేదికగా ఓ పోస్టు పెట్టి రేవంత్ రెడ్డి సర్కార్‌ను అభినందించారు. "ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని నేను ఎప్పటినుంచో సూచిస్తూనే ఉన్నాను. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


6వేలకే వైజాగ్‌ టు తిరుపతి టూర్‌ - సరికొత్త ప్లాన్ ప్రకటించిన టూరిజం శాఖ
తిరుమల దర్శించుకోవాలనుకునే వారి కోసం తక్కువ ఖర్చుతోనే సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది ఏపీ టూరిజం శాఖ. ముఖ్యంగా ఉత్తారంధ్రప్రజలకు ప్రయోజనం కలిగేలా ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ ప్లాన్ రూపొందించింది. రోజూ విశాఖ నుంచి అందుబాటులో ఉండే ఈ ప్యాకేజ్ పొందాలంటే మాత్రం వారం రోజులు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 19న విశాఖ నుంచి రోజూ తిరుపతికి టూర్ ప్యాకేజీ ప్రారంభించనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి