Visakha To Tirupati Tour Package: తిరుమల దర్శించుకోవాలనుకునే వారి కోసం తక్కువ ఖర్చుతోనే సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది ఏపీ టూరిజం శాఖ. ముఖ్యంగా ఉత్తారంధ్రప్రజలకు ప్రయోజనం కలిగేలా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ ప్లాన్ రూపొందించింది. రోజూ విశాఖ నుంచి అందుబాటులో ఉండే ఈ ప్యాకేజ్ పొందాలంటే మాత్రం వారం రోజులు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
19 వ తేదీ నుంచి విశాఖ నుంచి రోజూ తిరుపతికి టూర్ ప్యాకేజీ ప్రారంభించనుంది. ఈ ప్యాకేజీ కింద పెద్దలకు 6వేల 300 రూపాయలు, చిన్న పిల్లలకు ఆరు వేల రూపాయలు వసూలు చేయనున్నారు. రోజూ వైజాగ్‌లో సాయంత్రం మూడు గంటలకు బస్ బయల్దేరనుంది.
మూడు రోజుల పాటు సాగే ఈ టూర్‌లో తిరుపతితోపాతు శ్రీకాళహస్తి దేవాలయాన్ని కూడా తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు అప్పూఘర్‌లో ఉన్న యాత్రి నివాస్ వద్ద బస్ బయల్దేరనుంది.
టూర్ బస్ రూట్ ఇలా
3.00 PM -అప్పూఘర్ యాత్రి నివాస్ హెటల్
3.15 PM - ఎంవీపీ కాలనీ
3. 30 PM -మద్దిలపాలెం ఆర్టీసీ బస్‌డిపో ఎదురుగా
3.40 PM -ఆర్టీసీ కాంప్లెక్స్
4.00 PM - ఎన్‌ఏడీ జంక్షన్
4.15 PM - గాజువాక
5.00 PM - అనకాపల్లి బైపాస్
6.00 PM -రాజమండ్రి సీఆర్‌వో
రెండో రోజు టూర్ షెడ్యూల్
6.00 AM - శ్రీకాళహస్తి హరిత హోటల్‌లో రిఫ్రెష్- టిఫెన్
10.00 AM -తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం, హరిత హోటల్‌లో లంచ్ అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం
7.00 PM - హరిత హోటల్‌లో రాత్రి భోజనం
8.00 PM -భోజనం అనంతరం విశాఖకు తిరుగు పయనం
మూడో రోజు టూర్ షెడ్యూల్
9.00 AM విశాఖ చేరుకుంటారు.
ఈ టూర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 8897464333 నెంబర్‌ను లేదా... www.tourism.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.