Electricity Commission Chairman :  కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్ల కాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేసేందుకు నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ గా ఉంటూ ప్రెస్ మీట్ ఎలా పెడతారని..తన అభిప్రాయాల్ని ఎలా వెలిబుచ్చాతారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా.. నిష్పక్షపాతంగా ఉండాలన్నారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ గా మరొక జడ్జిని నియమించాలని సూచించారు. చీఫ్ జస్టిస్ సూచనకు  తెలంగాణ ప్రభుత్వ లాయర్ అంగీకరించారు. మధ్యాహ్నం తర్వాత కొత్త విద్యుత్ కమిషన్ చైర్మన్ గా ఎవరిని నియమిస్తారో చెప్పాలన్నారు. 


కమిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ 


విద్యుత్ కమిషన్ నియామకం,  ఆ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ముందుగానే అభిప్రాయాలు చెప్పడం వంటి వాటిపై కేసీఆర్ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.  విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై  విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ యగా.. కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది.  విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో కేసీఆర్‌ పాత్రపై కమిషన్‌ వివరణ కోరింది. తనను విచారణకు పిలవకూడదంటూ గులాబీ బాస్ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. కమిషన్ చైర్మన్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ముందే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారని కోర్టుదృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ అనుకూల ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  


కమిషన్ ఏర్పాటే చట్ట విరుద్ధమంటున్న కేసీఆర్                      


 కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ యాక్ట్‌ 1952, విద్యుత్తు చట్టం-2003కి అది విరుద్ధమని.. దాన్ని రద్దుచేయాలని కేసీఆర్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. విద్యుత్తు కొనుగోళ్లపై వివాదం ఉంటే.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండళ్లు తేల్చాలే తప్ప.. దానిపై విచారించే అధికారం కమిషన్‌కు లేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ .. ప్రస్తుత విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడంపైనే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మార్చాలన్నారు. కేసీఆర్   వ్యక్తం చేసిన అభ్యంతరాల్లో అది కూడా ఒకటి. కొత్త న్యాయమూర్తి పేరును చెప్పిన తర్వాత విచారణ కొనసాగించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇస్తే.. అది కేసీఆర్ కు ఇబ్బందేనని భావిస్తున్నారు. 


సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే విచారణకు ఆటంకం లేనట్లే 


సుప్రీంకోర్టు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే..  ఇక కేసీఆర్ కు అన్ని  దారులు మూసుకుపోయినట్లే అనుకోవచ్చు.  కమిషన్ విచారణను ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది.  ఇప్పటి వరకూ అసలు కమిషనే చట్ట విరుద్దం కాబట్టి విచారణ ఏం ఉండదని అనుకుంటున్నారు. ల