chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: లక్ష్మీ గుడికి బయల్దేరుతుంది. మరోవైపు ప్రముఖ పారిశ్రామిక వేత్త జేఎమ్మార్ ఇండియాకు తిరిగి వస్తారు. ఆయన వస్తున్న విషయం మిత్ర, అర్జుల్ వంటి ఎంతో మంది బిజినెస్‌మాన్‌లకు తెలిసిపోయిందని జేఎమ్మార్ పీఏపై కోప్పడతారు. దారి మధ్యలో తన ఆయన కారు దిగిపోయి తన వెంట ఉన్న నాలుగు కార్లని వెళ్లిపోమని తనకు ప్రశాంతత కావాలని దిగిపోతారు. ఇక లక్ష్మీ గుడికి వెళ్తున్న ఆటోని జేఎమ్మార్ ఆపుతారు. గుడికి వస్తానని అడుగుతారు. లక్ష్మీ ఒకే అంటుంది. లక్ష్మీని చూసి జేఎమ్మార్ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. ఇక ఆటో ఎక్కి పర్స్ ఓపెన్ చేసి అందులో తన కూతురు ఫోటో చూస్తారు అది అచ్చం లక్ష్మీలానే ఉంటుంది.
జేఎమ్మార్: ఈ రోజు నా కూతురు పుట్టిన రోజు శివాలయంలో అర్చన చేయించడానికి వెళ్తున్నాను.
లక్ష్మీ: ఆహా..
మిత్ర: కుటుంబరావుగారు ఇంత మంది ఉన్నారు.
కుటుంబరావు: ఇక్కడికి వస్తున్న వ్యక్తి అలాంటి వారు. మనం ఎలా ప్రాజెక్ట్ సంపాదించాలని వచ్చామో చాలా మంది అలాగే వచ్చారు సార్.
మిత్ర: అయితే ఇప్పుడు మనకు చాలా కాంపిటీషన్ అన్నమాట.
కుటుంబరావు: సార్ వీళ్లంతా మనకు కాంపిటీషన్ అవ్వరు. సార్ అసలైన కాంపిటేషన్ వచ్చారు.
అర్జున్: హాయ్ మిత్ర.. హౌవ్ ఆర్ యూ.
మిత్ర: ఐయామ్ అల్‌వేజ్ గ్రేట్ అర్జున్. ఎందుకంటే నీ లాంటి బలమైన పోటీదారుల్ని ఎప్పుడూ ఓడిస్తాను కాబట్టి.
అర్జున్: అందర్ని ఓడించిన నువ్వే నా చేతిలో ఓడిపోయావ్ గుర్తుందనుకుంటా.
మిత్ర: ఆ గెలుపు నీది కాదు అర్జున్ నీ వెనుక ఉన్న ఓ ఆడదానిది.
అర్జున్: ఇంకోసారి నీతో ఆ మాట అనిపించుకోవాలి అనుకోవడం లేదు. అందుకే ఈ సారి నేనే రంగంలోకి దిగాను.
మిత్ర: ఈసారి నిన్ను ఓడించడానికి నేనున్నాను.
లక్ష్మీ, జేఎమ్మార్ గుడికి వచ్చేస్తారు. జేఎమ్మార్ లక్ష్మీ వెంట నడుస్తూ తనని చూసి ఆయన కూతుర్ని గుర్తు చేసుకుంటారు. జేఎమ్మార్ ఆయన కూతురు సంయుక్త పేరు మీద అర్చన చేయించమంటారు. తన కూతురు ఓ ప్రమాదంలో చలనం లేకుండా అయిపోయిందని తాను తిరిగి మామూలు మనిషి అయ్యేలా కోరుతారు. ఆ మాటలు విని లక్ష్మీ ఫీలవుతుంది. మరోవైపు జేఎమ్మార్ లేకుండా ఆయన కార్లు ఇంటికి వెళ్తాయి. జేఎమ్మార్ డల్ ఉండటం చూసి లక్ష్మీ ఫీలవుతుంది. ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. జేఎమ్మార్ తన బాధని చెప్పుకొని చాలా ఫీలవుతారు.
లక్ష్మీ: మీ మంచితనం వృథాగా పోదు. మీ కూతురు కచ్చితంగా మీ కోసం తిరిగి వస్తుంది.
జేఎమ్మార్: నిన్ను చూస్తుంటే ఇప్పుడిప్పుడే నాకు నమ్మకం కలుగుతుందమ్మా. ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో నాకు ఊరట కలిగించాలని అనుకున్నాడు. అందుకే నిన్ను ఇలా నాకు పరిచయం చేశాడమ్మా.
లక్ష్మీ: నాదేముంది అండీ..
జేఎమ్మార్: నీ పరిచయం మాత్రం నాకు గొప్ప మేలు చేస్తుందమ్మ.
లక్ష్మీ: ఈ గుడికి ఓ ప్రత్యేక ఉందండి. 11 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న నెరవేరుతుంది. ఈ వయసులో మీరు ప్రదక్షిణలు చేయలేరు. మీ అమ్మాయి కోసం నేనే చేస్తాను. ఏం కానీ నేనే ప్రదక్షిణలు చేస్తాను అంటే ఆ భగవంతుడు కచ్చితంగా ఆలోచిస్తాడు. ఆ అమ్మాయికి కచ్చితంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. నేను ప్రదక్షిణలు చేసి వస్తాను.
జేఎమ్మార్: అలాగే అమ్మ. ఎవరు కన్న బిడ్డో అచ్చం నా కూతురిలా ఉంది. నా కూతురు నాతో మాట్లాడుతున్నట్లు ఉంది. ఈ అమ్మాయి వల్ల కాస్త అయినా ఓదార్పు కలిగినట్లుంది. చాలా సంతోషం తండ్రి..
లక్ష్మీ ప్రదక్షిణలు చేస్తుంటుంది. జేఎమ్మార్ సడెన్ పడిపోతారు. పంతులతో పాటు లక్ష్మీ కూడా హడావుడిగా అక్కడి వెళ్తుంది. సీపీఆర్ చేసి జేఎమ్మార్ లేచేలా చేస్తుంది. అందరూ ఆయనకు సపర్యలు చేస్తారు. పంతులు లక్ష్మీనే సీపీఆర్ చేసి బతికించిందని అంటాడు. జేఎమ్మార్ లక్ష్మీకి చాలా థ్యాంక్ చెప్తారు. నీ రుణం తీర్చుకోలేనని అంటారు. ఇక జేఎమ్మార్‌ని లక్ష్మీ డ్రాప్ చేయడానికి తీసుకెళ్తుంది. ఇక అర్జున్ కంపెనీలో తాను పని చేసినట్లు చెప్తుంది. ఇక లక్ష్మీ ఆటోలో జేఎమ్మార్ ఇంటికి చేరుకుంటారు. మిత్ర, అర్జున్‌లను చూస్తుంది. జేఎమ్మార్ ఇళ్లు ఇదేనా అని అనుకుంటుంది.
లక్ష్మీ: సార్ ఇది జేఎమ్మార్ గారి ఇళ్లు కదా.
జేఎమ్మార్: అవునమ్మా.
లక్ష్మీ: మీరు జేఎమ్మార్ గారి దగ్గర పనిచేస్తున్నారా. లేక ఆయన్ను కలవడానికి అందరిలానే వచ్చారా.
జేఎమ్మార్: ఓ రెండు నిమిషాలు ఆగమ్మా నీకే తెలుస్తుంది. పద.. ఇక సెక్యూరిటీ వచ్చి అందరూ మిమల్ని కలవడానికి వచ్చారు సార్ అంటే తనకి ఎవర్ని కలవడం ఇష్టం లేదని జేఎమ్మార్ చెప్తారు. ఇక లక్ష్మీని చూసిన అర్జున్ తన తల్లి వసుంధరకు కాల్ చేస్తాడు. అర్జున్ తన తల్లితో ఇంట్లో లక్ష్మీ ఉందా అని అడుగుతాడు. లేదని గుడికి వెళ్లిందని వసుంధర చెప్పడంతో జేఎమ్మార్ దగ్గర ఉన్నది లక్ష్మీనే అని అర్జున్ అనుకుంటాడు. జేఎమ్మార్‌తో లోపలికి వెళ్లిన సడెన్‌గా పైకి చూసి షాక్ అయిపోతుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రేవతికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కిరణ్.. త్వరలోనే పెళ్లి!