తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ రానుందా? అన్నాడీఎంకే బహిష్కృత నేత తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఈ రోజు తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ఎదురైంది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను శశికళ ఆయన నివాసంలో కలిశారు. అసలు ఈ అనూహ్య పరిణామానికి కారణమేంటి?
ఇంటికి వెళ్లి..
రజనీకాంత్, ఆయన సతీమణి లతా రజనీకాంత్‌తో శశికళ ఈరోజు ఆయన నివాసానికి వెళ్లి మాట్లాడారు. అయితే ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని శశికళ వర్గీయులు చెబుతున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు గానూ రజినీకాంత్‌ను శశికళ శుభాకాంక్షలు తెలియజేశారని తెలిపారు. రజనీకాంత్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.
అంతేనా..
శశికళ పార్టీ స్థాపించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రజనీకాంత్‌తో ఆమె భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైనప్పటికీ తిరిగి వచ్చేందుకు శశికళ ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఇందుకు పార్టీ పెద్దలు ఒప్పుకోలేదు. బహిరంగంగానే శశికళకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.
మొదటి నుంచి ఆమెను దూరం పెడతున్న పార్టీ ఇప్పుడు ఆమెకు అన్ని దారులు మూసివేసేలా చర్యలు చేపట్టింది. కార్యనిర్వహక కమిటీ సభ్యులు పార్టీ నిబంధనలలో కీలక మార్పులు చేశారు. పార్టీ సమన్వయకర్త, జాయింట్ కోఆర్డినేటర్ స్థానాలకు సింగిల్ ఓటు విధానాన్ని తప్పనిసరి చేస్తూ బైలాస్‌ను సవరించారు. అంటే.. పదవులు రెండు అయినా.. ఒకే ఓటు వేయాల్సి ఉంటుంది. దీంతో ఆ పదవుల్లో కొనసాగుతున్న పన్నీర్‌సెల్వం, పళనిస్వామి స్థానాలను మరింత సుస్థిరం చేశారు.
కొత్త పార్టీ..
అన్నాడీఎంకేలో స్థానం దక్కే పరిస్థితులు లేకపోయేసరికి శశికళ కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్లు కొంతమంది చెబుతున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజముందో తెలియాల్సి ఉంది.
Also Read: Rahul Gandhi In Lok Sabha: 'ఆ రైతు కుటుంబాలకు పరిహారమే కాదు ఉద్యోగాలు కూడా ఇవ్వాలి'
Also Read: UAE New Weekend Days: వీకెండ్ ఆహా.. ఆ ఊహ ఎంత బాగుందో! ఇక వారంలో 2.5 రోజులు సెలవు!
Also Read: Muzaffarnagar: పాఠశాలలో పాడు పని.. ప్రాక్టికల్ ఎగ్జామ్ పేరుతో డ్రగ్స్ ఇచ్చి బాలికలపై లైంగిక దాడి!
Also Read: Asia Power Index: రష్యాను దాటిన భారత్.. అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో @4వ ర్యాంకు
Also Read: Corona Cases: తగ్గిన కరోనా విజృంభణ.. 554 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి
Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి
Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే
Also Read: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి
Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి