PM Modi on Parliament Attendance: ఎంపీలకు మోదీ వార్నింగ్.. 'మీరేం చిన్నపిల్లలు కాదు.. మారతారా లేక మార్చేయాలా'

ABP Desam   |  Murali Krishna   |  07 Dec 2021 03:18 PM (IST)

పార్లమెంటు సమావేశాలకు భాజపా ఎంపీలు గైర్హాజరవడంపై ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. ఇక మారకపోతే మార్పులు తప్పవని హెచ్చరించారు.

ఎంపీలకు ప్రధాని మోదీ వార్నింగ్

భాజపా ఎంపీలపై ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో తరుచుగా గైర్హాజరవడంపై సీరియస్ అయ్యారు. పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రధాని ప్రస్తావించినట్లు సమాచారం.

ఇదే లాస్ట్..

గైర్హాజరయ్యే ఎంపీలు ఇకనైనా తమ పద్ధతి మార్చుకోవాలని, లేదంటే మార్పులు తప్పవని మోదీ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

చిన్న పిల్లలకకు చెప్పినట్లు ప్రతిసారి సమావేశాలకు హాజరు కావాలని చెప్పడం బాలేదు. పిల్లలు కూడా ఇలా చెప్పించుకోరు. ఇకైనానా మారండి. లేదంటే సమయానుగుణంగా మార్పులు జరుగుతాయి.                          - ప్రధాని మోదీ వార్నింగ్

ఇది కొత్తేం కాదు..

అయితే ఎంపీల గైర్హాజరుపై మోదీ హెచ్చరించడం ఇది తొలిసారేం కాదుయ. గతంలోనూ మోదీ పలుమార్లు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలు క్రమశిక్షణ పాఠించాలని, అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని గతంలో కూడాా మోదీ చెప్పారు. 

మోదీకి సన్మానం..

ఈ సమావేశం ప్రారంభానికి ముందు మోదీకి పూలమాలలు వేసి ఎంపీలు స్వాగతం పలికారు నేతలు. నవంబర్ 15ను బిర్సా ముండా జయంతిగా నిర్వహించుకోవాలని చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి అర్జున్ ముండా హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. శాలువా కప్పి సత్కరించారు.

Also Read: Muzaffarnagar: పాఠశాలలో పాడు పని.. ప్రాక్టికల్ ఎగ్జామ్ పేరుతో డ్రగ్స్ ఇచ్చి బాలికలపై లైంగిక దాడి!

Also Read: Asia Power Index: రష్యాను దాటిన భారత్.. అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో @4వ ర్యాంకు

Also Read: Corona Cases: తగ్గిన కరోనా విజృంభణ.. 554 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి

Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి

Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే

Also Read: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి

Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 07 Dec 2021 03:16 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.