Gunshots At Iran: ఇరాన్‌లోని జైల్‌లో కాల్పులు, మంటలు - డెత్ టు డిక్టేటర్ అంటూ నినాదాలు
Gunshots At Iran: టెహ్రాన్‌లోని జైల్‌లో అర్ధరాత్రి కాల్పులు వినిపించాయి.
Gunshots At Iran:
టెహ్రాన్‌లోని జైల్‌లో కాల్పులు..
ఇరాన్ కొంత కాలంగా అట్టుడుకుతోంది. దాదాపు నెల రోజులుగా అక్కడ యాంటీ హిజాబ్ ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఓ యువతి మరణంతో మొదలైన ఆందోళనలు..రెండు మూడు రోజుల్లోనే తీవ్రమయ్యాయి. ఈ నిరనసకారుల్ని ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తూ జైళ్లకు పంపుతోంది అక్కడి ప్రభుత్వం. టెహ్రాన్‌లోని Evin Prisonలో వందలాది మందిని ఉంచారు. ఆ దేశంలోనే అత్యంత దారుణమైన జైలుగా పేరున్న..ఈ ఎవిన్ ప్రిజన్‌లోనూ హిజాబ్ అంశం ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే...ఉన్నట్టుండి ఈ జైల్లోనుంచి కాల్పుల శబ్దాలు వినిపించాయి. పెద్ద ఎత్తున మంటలూ ఎగిసిపడ్డాయి. ఈ వీడియోని ఇరాన్ మానవ హక్కుల సంఘం ట్విటర్‌లో షేర్ చేసింది. "మంటలు
పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. కాల్పుల శబ్దాలూ వినిపిస్తున్నాయి" అని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో "డెత్ టు డిక్టేటర్" అంటూనినాదాలూ వినిపించాయి. ఈ హిజాబ్ అల్లర్లలో అరెస్టైన వారిని తాత్కాలికంగా విడుదల చేసి మళ్లీ జైలుకి బలవంతంగా తీసుకొచ్చారు. ఈ జైల్లో ఉన్న వారెవరూ "సేఫ్‌గా" ఉండరన్న ప్రచారం అక్కడ జోరుగానే సాగుతోంది. ఇప్పటి వరకూ ఈ ఆందోళనల్లో 108 మంది మృతి చెందినట్టు అంచనా. వీరిలో 23 మంది మైనర్లూ ఉన్నట్టు తెలుస్తోంది.
Gunshots can be heard from Evin Prison and smoke can be seen.#MahsaAmini #IranRevolution#مهسا_امینیpic.twitter.com/ut5Ds0Oup9
— 1500tasvir_en (@1500tasvir_en) October 15, 2022
The Islamic republic and IRGC are staging a conflagration in the #Evin prison to kill political prisoners! Please be the voice of these prisoners! Be the voice of Iranians!#MahsaAmini#مهسا_امینی pic.twitter.com/lkhMc6ShRG
— ممد پوری (@mamadporii) October 15, 2022
యాంటీ హిజాబ్ ఉద్యమం..
ఇరాన్‌లో మహిళలంతా యాంటీ హిజాబ్ ఉద్యమాన్ని రోజురోజుకీ తీవ్రతరం చేస్తున్నారు. హిజాబ్ ధరించలేదని ఓ యువతిని అరెస్ట్ చేయడం, ఆమె కస్టడీలోనే మృతి చెందడం అక్కడి మహిళలకు ఆగ్రహం కలిగించింది. ఆ ఘటన జరిగినప్పటి నుంచి అక్కడి మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. బహిరంగంగానే హిజాబ్‌ను తొలగించి నినదిస్తున్నారు. మొదట్లో కేవలం ఒకటి రెండు చోట్ల మాత్రమే కనిపించిన ఈ వ్యతిరేకత...క్రమంగా దేశమంతా వ్యాపించింది. సోషల్ మీడియాలోనూ ఇరాన్ మహిళలకు మద్దతు లభిస్తోంది. పలువురు ప్రముఖులు కూడా దీనిపై స్పందించారు. ఇప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు ఆమె సతీమణి మిషెల్లే కూడా దీనిపై మాట్లాడారు. ఇరానియన్ మహిళలకు వాళ్లకు మద్దతుగా నిలబడ్డారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా...సోషల్ మీడియా వేదికగా ఓ స్టేట్‌మెంట్ కూడా విడుదల చేశారు. "ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సంవ సందర్భంగా...ఇరానియన్ మహిళలకు మేము అండగా నిలబడ తామని మాటిస్తున్నాం. ఈ ఆందోళనలతో మహిళలందరికీ స్ఫూర్తినిస్తున్న వారికీ మా మద్దతు ఉంటుంది" అని వెల్లడించారు. 80 నగరాల్లో యాంటీ హిజాబ్ నిరసనలు కొనసాగుతున్నాయి.
Also Read: Congress President Election: 20 ఏళ్ల తరవాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక, కొనసాగుతున్న పోలింగ్