ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు. భార్య కాపురానికి వస్తుందని.. ముద్దు ముచ్చట్లతో మురిసిపోవచ్చని అనుకున్నాడు. ఇల్లు రెడీ చేసుకున్నాడు. సుఖంగా సంసారం చేసుకోవడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. కానీ భార్య వచ్చే శుభముహుర్తం రాక ముందే డైవర్స్ తీసేసుకున్నాడు. ఎందుకంటే ఆ శుభముహుర్తం ఇక రాదేమోనని ఆ పెళ్లికొడుకు భయపడ్డాడు. చివరికి ఎటూ కాకుండా పోతానని ఆందోళన చెందాడు. అదే విషయాన్ని కోర్టుకు చెప్పాడు. చివరికి విడాకులు తీసుకున్నాడు.
Also Read: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని
కోర్టు కూడా మరింత ఆలస్యం చేయకుండా అతనికి విడాకులు ఇచ్చేసింది.ఎందుకంటే భార్య తనతో కాపురానికి వచ్చే శుభముహుర్తం కోసం అతను పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎంత కాలం చూసినా ఆ శుభముహుర్తం ఇంకా ఇంకా లేదని చెబుతూ ఆ పెళ్లి కూతురు పుట్టింట్లోనే ఉండిపోయింది. చివరికి కోర్టులో విడాకుల కేసు వేసినా ఆమె రాలేదు. మంచి ముహుర్తం కోసం చూస్తూనే ఉంది. ఈ లోపు ఆ మంచి ముహుర్తం రాకుండానే కోర్టు విడాకులిచ్చేసింది. ఈ ఘటన చత్తీస్‌ఘడ్‌లో చోటుచేసుకుంది.
Also Read: అమెరికా ఎయిర్‌పోర్టులో మత్తులో రచ్చ చేసి...యూరిన్ పోసింది ఆర్యన్ ఖానేనా ? నిజం ఏమిటి ?
చత్తీస్‌ఘడ్‌కు చెందిన సంతోష్ సింగ్ 2010లో పెళ్లి చేసుకున్నాడు. అప్పట్నుంచి ఆయన భార్య కాపురానికిరాలేదు. ఎప్పుడు పిలిచినా మంచి ముహుర్తం లేదని.. అది చూసి వస్తానని చెప్పేది. సంతోష్ సింగ్ చాలా ఓపికతో రోజులు.. వారాలు.. నెలలు లెక్కబెట్టుకుంటూ వచ్చారు. ఎన్నేళ్లు గడిచినా ఆమె రావడం లేదు. దీంతో ఏదో తేడాగా ఉందని అనుమానించి .. పదేళ్లు చూసి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేశాడు . వాదనల్లో కూడా ఆ పెళ్లి కూతులు అదే వాదన వినిపించి తనను అత్తవారింటికి తీసుకెళ్లేందుకు శుభముహుర్తంలో తన భర్త ఎప్పుడూ రాలేదని చెప్పింది.
ఇరువురి వాదనలు విన్న కోర్టుల శుభముహుర్తం అనేది కుటుంబం ఆనందంగా ఉండేందుకు పెట్టుకునే ముహుర్తం అని ఈ కేసులో మాత్రం వివాహ బంధాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఉపయోగించుకున్నారని తేల్చింది. విడాకులు మంజూరు చేసింది.
Also Read: RGV Questions AP Govt: వర్మ వదలడం లేదుగా... ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ సంధించిన తాజా ప్రశ్నలు!