రెండు రోజులుగా ఆర్యన్ ఖాన్ వీడియో అంటూ అమెరికా ఎయిర్‌పోర్టులో ఓ కుర్రాడు మత్తులో తూలుతూ.. ఈ లోకంలో లేనట్లుగా వ్యవహరిస్తూ.. చివరికి బహిరంగంగా యూరిన్ కూడా పోసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో కుర్రాడు.. ఎర్రగా...బుర్రగా కాస్త షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను పోలినట్లుగా ఉండటంతో ఇదే సందు అని కొంత మంది విస్తృతంగా సర్క్యూలేట్ చేయడం ప్రారంభించారు. అందులో ఉన్నది ఆర్యన్ ఖానేనని .. ఆయన పూర్తిగా డ్రగ్ ఎడిక్ట్ అనేదానికి అదే సాక్ష్యమని ప్రచారం చేయడం ప్రారంభించారు. 


Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..


వాట్సాప్ గ్రూపులన్నింటిలోనూ ఇది వైరల్ అయింది. దీంతో ఫ్యాక్ట్ చెక్ చేసింది ఏబీపీ గ్రూప్. ఆ వీడియో ఎక్కడిదా అని పరిశోధించింది. చివరికి ఆ వీడియోలో ఉన్నది ఆర్యన్ ఖాన్ కాదని తేలింది. ఆ వీడియోలో ఉన్నది కూడా సెలబ్రిటీనే అందుకే వైరల్ అయింది. ఇంగ్లిష్ సినిమా ట్విలైట్ యాక్టర్ బ్రాస్నన్ పెల్లటీర్‌. పైగా ఆ వీడియో ఇప్పటిది కాదు. దాదాపుగా పదేళ్ల కిందటిది. 2012 నుంచి ఇది సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. అప్పట్లో లాస్ ఎంజెల్స్ ఎయిర్‌పోర్టులో బ్రాస్నన్ ఇలాంటి స్థితిలో ఉండటంతో కొంత మంది వీడియో తీసి నెట్‌లో పెట్టారు. 






Also Read: RGV Questions AP Govt: వర్మ వదలడం లేదుగా... ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ సంధించిన తాజా ప్రశ్నలు!


షారుక్ ఖాన్ అంటే ఇష్టం లేని వాళ్లు.. కొంత మంది ఆయన ఆర్యన్ ఖానే అంటూ ప్రచారంచేయడం ప్రారంభించారు. ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు కారణంగా సెలబ్రిటీ అయిపోయారు. గూగల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తుల్లో ఆర్యన్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నారు. అయితే ఆయనను టార్గెట్ చేయడం మాత్రం నెటిజన్లు ఆపలేదు. 



Also Read: RGV: పవన్ సినిమాకి సంపూ సినిమాకి తేడా లేనప్పుడు మీ ప్రభుత్వంలో మంత్రికి డ్రైవర్‌కి కూడా తేడా లేదా? ఆర్జీవీ స్ట్రాంగ్‌ కౌంటర్







Also Read: బాధలో దీప్తి సునయన.. చిల్ అవుతోన్న సిరి, షణ్ముఖ్..




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి