By: Ram Manohar | Updated at : 27 Sep 2023 12:29 PM (IST)
టిబెట్‌కి స్వయం ప్రతిపత్తి కావాలని చైనాను కోరనున్నట్టు దలైలామా కీలక ప్రకటన చేశారు. (Image Credits: www.dalailama.com)
Dalai Lama on Tibet:
స్వయం ప్రతిపత్తి కోసం..
"టిబెట్ మాదే" అని చైనా ఎన్నో దశాబ్దాలుగా వాదిస్తోంది. 1950ల్లోనే ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించింది డ్రాగన్. టిబెట్ చైనాలో
భాగమే అని డ్రాగన్ ఎప్పటి నుంచో పిడివాదం చేస్తోంది. బౌద్ధ ఆధ్యాత్మిక వేత్త దలైలామా ఈ వాదాన్ని మొదటి నుంచి ఖండిస్తున్నారు. ప్రస్తుతానికి హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉంటున్నారు దలైలామా. చైనా టిబెట్ ఆక్రమణపై అహింసామార్గంలోనే ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు. 1950 నుంచి ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఈ ఉద్యమానికి నిరసనగానే చైనా చాలా సందర్భాల్లో ఆయనపై విమర్శలు చేసింది. తదుపరి దలైలామా ఎవరో ఎంపిక చేసే హక్కు ఆయనకు లేదని ఆ మధ్య తేల్చి చెప్పింది. దలైలామా విషయంలో తమ నిర్ణయమే నెగ్గాలని భావిస్తోంది. ఇదే సమయంలో దలైలామా మాత్రం స్వతంత్ర టిబెట్ కోసం ప్రత్యేక ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తదుపరి దలైలామాను ఎంపిక చేసుకోవడంలో చైనా విఫలమైతే...టిబెట్‌ను దక్కించుకోవడమూ అంత సులభం కాదు. అందుకే అంత పంతంగా ఉంది డ్రాగన్. ఈ పరిణామాల క్రమంలోనే దలైలామా ఇటీవల చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. టిబెట్‌కి స్వాతంత్య్రం అవసరం లేదని, స్వయం ప్రతిపత్తి ఇస్తే చాలని అభిప్రాయపడ్డారు దలైలామా. ఇలా చేయడం వల్ల చైనాకే రాజకీయంగా మేలు కలుగుతుందని వెల్లడించారు.
"టిబెట్‌కి స్వాతంత్య్రం ఇవ్వాలని మేం అడగడం లేదు. మేం చైనాకి చెప్పేది ఒక్కటే. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోనే భాగమైనప్పటికీ టిబెట్‌కి స్వయంప్రతిపత్తి ఇవ్వాలి. అలా జరిగితే టిబెటియన్లను వేరు చేయకుండానే లక్షలాది మంది చైనీయులకు రాజకీయపరంగా సాయం చేసేందుకు వీలవుతుంది. చైనీయులకు అర్థమయ్యేలా ఇది వివరించాలని అనుకుంటున్నాను. టిబెట్‌కి కచ్చితంగా స్వయం ప్రతిపత్తి వస్తుందన్న నమ్మకముంది"
- దలైలామా
ధర్మశాలలోని McLeod Ganj వద్ద తన ఇంట్లోనే జర్నలిస్ట్‌లతో మాట్లాడారు దలైలామా. టిబెట్ సమస్యని పరిష్కరించడంలో "మధ్యేవాదమే" మంచిదని తేల్చి చెప్పారు. చైనా ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, అక్కడి వాళ్లూ తనను గౌరవిస్తున్నారని అన్నారు.
"నాకు తెలిసినంత వరకూ చైనా ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. వాళ్లు కూడా నాపైన ప్రేమ చూపిస్తున్నారు. చైనాకు నేను తిరిగి రావాలనీ కొందరు కోరుకుంటున్నారు. కానీ నాకు అక్కడికి వెళ్లాలని లేదు. ధర్మశాల నాకు చాలా నచ్చింది. ఇక్కడే ఉండిపోతాను"
- దలైలామా
1950 నుంచే పోరాటం..
1989లో దలైలామాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అందుకు కారణం...టిబెట్ సంస్కృతిని, భాషని ఆయన కాపాడడం. 1950 ఎప్పుడైతే చైనా టిబెట్‌ని ఆక్రమించిందో అప్పటి నుంచి ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. టిబెటియన్లు ఎదుర్కొంటున్న సమస్యలను అగ్రస్థాయి నేతల దృష్టికి తీసుకెళ్లారు. 1954లో బీజింగ్‌లో పర్యటించారు. మావో జెడాంగ్, డెంగ్ జియాపింగ్ లాంటి కీలక నేతలతో భేటీ అయ్యారు. అయినా ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. 1959 లో చైనా నుంచి భారత్‌కి వచ్చేశారు దలైలామా. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. భారత్-చైనా మధ్య ఉన్న విభేదాల్లో కచ్చితంగా టిబెట్ అంశమూ ఒకటి. ముఖ్యంగా దలైలామాకి భారత్ ఆశ్రయమివ్వడంపై చైనా తీవ్ర ఆగ్రహానికి లోనైంది. 2020 జూన్‌లో గల్వాన్ ఘర్షణ తరవాత భారత్, చైనా మధ్య ఉన్న ఆ కాస్త సత్సంబంధాలు కూడా తగ్గిపోయాయి. వైరం పెరుగుతూ వచ్చింది. ఇలాంటి సమయంలో 2021లో ప్రధాని నరేంద్ర మోదీ దలైలామా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. భారత్‌కి ఆయన దగ్గరవుతున్నారన్న సంకేతాలిచ్చినట్టైంది. దీంతో చైనా మరింత అసహనానికి గురైంది. ఇటీవల భారత్ వేదికగా జరిగిన G20 సదస్సుకీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరుకాలేదు. కొత్త దలైలామా కోసం వెతుకుతున్నట్టు చైనా ఇప్పటికే ప్రకటించింది. తమకు అనుకూలమైన వ్యక్తిని ఆ పదవిలో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. దలైలామా ఈ విషయంలో ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చారు. తనకు 90 ఏళ్లు వచ్చాక టిబెట్‌లోని కీలక నేతలతో చర్చించింది తదుపరి దలైలామా ఎవరో ప్రకటిస్తామని వెల్లడించారు. తదుపరి దలైలామా ఓ మహిళ కూడా కావచ్చు అని హింట్స్ ఇచ్చారు.
Also Read: ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌తో భారత్‌కి సంబంధం లేదు, నిజ్జర్ హత్యపై జైశంకర్ క్లారిటీ
Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు - కేంద్రం నిర్ణయం సరైనదేనని స్పష్టీకరణ
Sabrimala Temple: శబరిమలలో విషాదం, అయ్యప్ప ఆలయంలో ఆగిన చిన్నారి గుండె
Latest Gold-Silver Prices Today: జర్రున జారుతున్న గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ
Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు
Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం
MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!
Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్- తప్పులేదన్న సజ్జనార్
Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
/body>