బాధితులు, నిందితులపై న్యాయవ్యవస్థకు అవగాహన ఉండాలి. చట్టం మానవీయంగా పనిచేయాలి. ఏ విషయంలోనైనా అన్యాయం జరిగిన బాధితుడికి న్యాయ వ్యవస్థ ఆఖరి ఆశాకిరణంగా కనిపిస్తుంది. అందువల్ల న్యాయమూర్తులు భారత రాజ్యాంగం అప్పగించిన గొప్ప బాధ్యతలను చిత్తశుద్ధి, నిబద్ధతతో నిర్వహించాలి. కోర్టు ఇచ్చే తీర్పుల ప్రభావం సమాజంపై ఉంటుంది. కనుక అందరికీ అర్థమయ్యే సరళ భాషలో తీర్పులు ఉండాలి. న్యాయవ్యవస్థలో పారదర్శకత తీసుకురావడానికి డేటా మేనేజ్‌మెంట్ అవసరం. అప్పుడు బాధితువలకు సత్వర న్యాయం జరుగుతుంది. న్యాయవ్యవస్థకు ఉన్న స్వేచ్ఛ, సమగ్రతను అన్ని స్థాయిల్లో మనం కాపాడాలి, ప్రచారం చేయాలి, భద్రపరచాలి.                            -     సీజేఐ ఎన్‌వీ రమణ