ABP  WhatsApp

Chinese Journalist Jailed: ఇవేం పనులయ్యా జిన్ పింగ్.. చావుబతుకుల్లో జర్నలిస్ట్.. ప్రశ్నిస్తే చంపేస్తారా?

ABP Desam Updated at: 05 Nov 2021 03:58 PM (IST)
Edited By: Murali Krishna

కరోనా పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్ నగరంలో పరిస్థితులను ప్రశ్నించిన ఓ చైనా జర్నిలిస్టు ప్రస్తుతం చావుబతుకుల్లో ఉన్నారు.

చావుబతుకుల్లో చైనా జర్నలిస్ట్

NEXT PREV

చైనా ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇందుకు చాలానే ఉదాహరణలున్నాయి. కరోనా వచ్చిన కొత్తలో వుహాన్ నగరంలో పరిస్థితులను ప్రశ్నించిన ఓ జర్నిలిస్టు పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆమె చావుబతుకుల్లో ఉన్నారు.


ఎవరామె?


చైనాకు చెందిన ఝాంగ్‌ జాన్ (38) ఓ జర్నలిస్టు. అంతకుముందు ఆమె న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2020లో వుహాన్ నగరంలో కరోనా పరిస్థితులను ప్రపంచానికి తెలియజేసినందకు, వార్తలు రాసినందుకు ఆమెను జిన్‌పింగ్ ప్రభుత్వం జైల్లో పెట్టింది. రెచ్చగొట్టే చర్యల ద్వారా ఇబ్బందులు సృష్టిస్తున్నారనే ఆరోపణలతో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు.


ఝాంగ్‌ జాన్‌ ఆరోగ్యం బాగోలేదని.. ఎక్కువకాలం బతకరంటూ.. ఇక విడిచిపెట్టాలని ప్రభుత్వాన్ని ఆమె కుటుంబం అభ్యర్థిస్తోంది.  ఈ మేరకు ఆమె సోదరుడు ఓ ట్వీట్ చేశారు.



ఝాంగ్ జాన్ చాలా బలహీనంగా ఉంది. ఎక్కువ కాలం బతకదు. రానున్న చలికాలంలో ఆమె బతికే అవకాశం లేకపోవచ్చు. ప్రస్తుతం ఆమె కనీసం నడవలేని స్థితిలో ఉంది. తలకూడా తనంతట తాను పైకి లేపలేకపోతోంది.                       - ఝాంగ్ జాన్ సోదరుడు


మానవహక్కుల సంఘాలు..


ఝాంగ్ జాన్ సోదరుడి ట్వీట్‌తో అక్కడి హక్కుల సంఘాలు ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా చైనా ప్రభుత్వానికి అభ్యర్థన చేసింది. ఆమె ప్రస్తుతం నిరాహార దీక్ష చేస్తుందని, ఝాంగ్ జాన్‌కు వైద్యం చాలా అవసరమని ఆమ్నెస్టీ తెలిపింది. కనీసం ఆమెను కలిసేందుకు కుటుంబానికి కూడా అనుమతి ఇవ్వడం లేదని హక్కుల సంఘాలు చెబుతున్నాయి. 


Also Read: Zika Virus Kanpur: ఆడ దోమతో జాగ్రత్త గురూ.. జికా వైరస్ ధాటికి ఉత్తర్‌ప్రదేశ్ గజగజ


Also Read: Virat Kohli Birthday: 'కోహ్లీ.. నీ గురించి లోకానికి అరిచి చెప్పాలని ఉంది..' విరాట్‌కు అనుష్క స్పెషల్ విషెస్


Also Read: PM Modi Kedarnath Visit: కేదార్‌నాథ్‌ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు.. శంకరాచార్యుని విగ్రహం ఆవిష్కరణ


Also Read: PAK vs NAM, Match Highlights: సెమీస్ కు పాక్‌.. వరుసగా నాలుగో విక్టరీ! నమీబియాకు హ్యాట్సాఫ్‌.. కాసేపు వణికించారు!


Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ


Also Read: SA vs BANG, Match Highlights: సెమీస్‌ రేసులో సఫారీలు..! బంగ్లా 84కే చిత్తు.. 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విక్టరీ


Also Read: Ind vs NZ T20 Series: టీమ్‌ఇండియాలో భారీ మార్పులు.. న్యూజిలాండ్‌ టీ20 సిరీసుకు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 05 Nov 2021 03:57 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.