విరాట్ కోహ్లీ.. ఇది పేరు కాదు.. ఓ బ్రాండ్. క్రికెట్ గురించి తెలియనివాళ్లకు కూడా ఈ పేరు బాగా తెలుసు. ఎందుకంటే క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ తర్వాత ఆ స్థాయిలో పేరు సంపాదించిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. సచిన్‌కు 'రికార్డ్ మేకర్'గా పేరుంటే.. కోహ్లీకి మాత్రం 'రికార్డ్ బ్రేకర్'గా పేరుంది. ఎందుకంటే సచిన్ నెలకొల్పిన ఎన్నో రికార్డులను విరాట్ బ్రేక్ చేశాడు.
సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. 33వ బర్త్‌డే చేసుకుంటున్న విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, క్రీడ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు విషెస్ చెప్తున్నారు.
అయితే అన్నింటిలోకి విరాట్ భార్య నటి అనుష్క శర్మ చెప్పిన బర్త్ డే విషెస్ చాలా స్పెషల్. విరాట్‌పై ఉన్న ప్రేమను మాటల్లో అనుష్క చెప్పిన విధానం చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అనుష్క ఏం చెప్పిందో తెలుసా మరి.
అనుష్క పొయట్రీ..
పొయిటిక్‌గా తన భర్తకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు చెప్పింది అనుష్క శర్మ. ఇద్దరూ ఆనందంగా నవ్వుతూ కలిసి దిగిన పొటోను షేర్ చేస్తూ ఓ కవిత రాసి ఇన్‌స్టాలో శుభాకాంక్షలు చెప్పింది.
ఈ ఫొటోకు, నీ జీవితానికి ఫిల్టర్ లేదు. నువ్వు నిలువెత్తు నిజాయతీ, ధైర్యంతో కూడిన మనిషివి. చీకటిని చీల్చుకొని వెలుగులోకి రావడం అంత సులభం కాదు. అలా వచ్చిన వాడిలో నువ్వు ఒకడివి. అనుకున్నది సాధించడానికి ధైర్యంగా ముందడుగు వేస్తావ్ అందుకే నువ్వెళ్లే దారిలోనూ ది బెస్ట్ అనిపించుకున్నావ్. మనం ఎప్పుడూ ఇలా సోషల్ మీడియాలో మాట్లాడుకునే వాళ్లం కాదని నీకు కూడా తెలుసు. కానీ నువ్వెంత గొప్ప వ్యక్తివో అరిచి ప్రపంచానికి చెప్పాలని కొన్నిసార్లు అనిపిస్తోంది. మా జీవితాల్లో ప్రతిదాన్ని ప్రకాశవంతంగా, అందంగా మార్చినందుకు ధన్యవాదాలు. పుట్టిన రోజు శుభాకాంక్షలు. - అనుష్క శర్మ
శుభాకాంక్షల వెల్లువ..
ధైర్యవంతులకు కఠిన సమయం ఎక్కువ రోజులు ఉండదు. యుగానికి ఒక్కడు లాంటి ప్లేయర్.. విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. - వీరేంద్ర సెహ్వాగ్
హ్యాపీ బర్త్‌డే బ్రదర్.. విరాట్ కోహ్లీ. నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలి. ఇలానే ఎంతోమందికి ప్రేరణగా నిలవాలి. - హర్బజన్ సింగ్
Also Read: PAK vs NAM, Match Highlights: సెమీస్ కు పాక్.. వరుసగా నాలుగో విక్టరీ! నమీబియాకు హ్యాట్సాఫ్.. కాసేపు వణికించారు!
Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ
Also Read: SA vs BANG, Match Highlights: సెమీస్ రేసులో సఫారీలు..! బంగ్లా 84కే చిత్తు.. 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విక్టరీ
Also Read: Ind vs NZ T20 Series: టీమ్‌ఇండియాలో భారీ మార్పులు.. న్యూజిలాండ్ టీ20 సిరీసుకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి