జాతీయ క్రీడా పురస్కారాలను నవంబర్‌ 13న అందిస్తామని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. దిల్లీలోని దర్బార్‌ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమం  నిర్వహిస్తామని ప్రకటించింది. రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ క్రీడాకారులకు పురస్కారాలు బహూకరిస్తారని పేర్కొంది. గతేడాదిని మించి ఈ సారి మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారాన్ని ఏకంగా 12 మందికి అందిస్తున్నారు.


అటు టోక్యో ఒలింపిక్స్‌.. ఇటు పారాలింపిక్స్‌లో ఈ సారి క్రీడాకారులు పతకాల పంట పండించారు. మొదట ఒలింపియన్లు మురిపిస్తే తర్వాత పారాలింపియన్లు దుమ్మురేపారు. వారిని మించి పతకాలు సాధించి ఆకట్టుకున్నారు. అందుకు ఖేల్‌రత్నను ఈసారి ఎక్కువగా వారికే అందించి గౌరవిస్తున్నారు. 


నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్‌), రవికుమార్‌ (రెజ్లింగ్‌), లవ్లీనా (బాక్సింగ్‌), శ్రీజేశ్‌ (హాకీ), పారాలింపియన్స్‌ అవనీ లేఖర (షూటింగ్‌), సుమిత్‌ అంటిల్‌ (బ్యాడ్మింటన్‌), ప్రమోద్‌ భగత్‌ (బ్యాడ్మింటన్‌), కృష్ణా నాగర్‌ (బ్యాడ్మింటన్‌), మనీశ్‌ నర్వాల్‌ (షూటింగ్‌), క్రికెటర్‌ మిథాలీ రాజ్‌, ఫుట్‌బాలర్‌ సునిల్‌ ఛెత్రీ, హాకీ ఆటగాడు మన్‌ప్రీత్‌ సింగ్‌ పురస్కారం అందుకోనున్నారు.


యువ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా భారత్‌కు తొలిసారి అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం అందించాడు. వందేళ్ల తర్వాత అథ్లెటిక్స్‌లో పతకం అందించి చరిత్ర సృష్టించాడు. జావెలిన్‌ను అందరికన్నా ఎక్కువ దూరం విసిరి సంచలనంగా మారాడు. ఇక యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గెహెయిన్‌ ఊహించని రీతిలో పతకం కొల్లగొట్టింది. కరోనా సోకినా.. విదేశాల్లో శిక్షణ తీసుకోలేకపోయినా పతకం ముద్దాడింది. కొన్నేళ్ల తర్వాత భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. ఇందుకు గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ ఎంతగానో కష్టపడ్డాడు. ఎన్నో గోల్స్‌ను సేవ్‌ చేశాడు.


పారాలింపిక్స్‌లో అవనీ లేఖర రెండు స్వర్ణాలు కొల్లగొట్టింది. బ్యాడ్మింటన్లో సుమిత్‌, ప్రమోద్‌, కృష్ణ దుమ్మురేపారు. మనీశ్‌ నర్వాల్‌ షూటింగ్‌లో సంచలనం సృష్టించాడు. అమ్మాయిల క్రికెట్లో మిథాలీ రాజ్‌ నవ చరిత్ర లిఖించింది. ఆమెలా ఎవరూ పరుగులు చేయలేదు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో లయోనల్‌ మెస్సీతో పోటీపడుతూ ఛెత్రీ గోల్స్‌ చేస్తున్నాడు. టాప్‌ 3లో ఉంటున్నాడు.


Also Read: T20 Worldcup 2021: టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లేనా.. ఇది న్యాయమేనా?


Also Read: T20 World Cup 2021: ఇక అఫ్గాన్ దయ.. టీమ్‌ఇండియా ప్రాప్తం! 'ప్రియమైన శత్రువు' దెబ్బకు కోహ్లీసేన కుదేలు


Also Read: Ind vs Nz T20 WC: బుడగ బతుకుతో ప్రపంచకప్‌ ఆశలు ఛిద్రం..! కుటుంబానికి దూరమై ఇబ్బంది పడుతున్నాం అంటున్న బుమ్రా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి