ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 33,437 నమూనాలు పరీక్షించగా 259 కొత్త కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఐదుగురు మరణించారని తెలిపింది. కరోనా నుంచి 354 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,042 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కోవిడ్‌ వల్ల గుంటూరులో ఇద్దరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని పేర్కొంది. 


Also Read: కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,66,929కి చేరింది. వీరిలో 20,48,505 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 354 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 4,042 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,382కు చేరింది. 


Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..


దేశంలో కరోనా కేసులు


దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 10,423 కేసులు నమోదుకాగా 443 మంది మరణించారు. 15,021 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలోనూ కరోనా కేసులు తగ్గుతున్నాయి. కొత్తగా 5,297 కరోనా కేసులు నమోదుకాగా 368 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య  49,73,954కు చేరగా మొత్తం మరణాల సంఖ్య 32,049కి పెరిగింది. మహారాష్ట్రలో కొత్తగా 809 కరోనా కేసులు నమోదయ్యాయి. 2020, మే 2 నుంచి ఇవే అత్యల్పం. మొత్తం కేసుల సంఖ్య 66,11,887కు పెరగగా మొత్తం మరణాల సంఖ్య 1,40,226కు చేరింది. మొత్తం 14 జిల్లాల్లో ఎర్నాకులంలో అత్యధికంగా 867 కేసులు నమోదుకాగా తిరువనంతపురం (750), కొజికోడ్ (637) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.



  • మొత్తం కేసులు: 3,42,96,237

  • యాక్టివ్ కేసులు: 1,53,776

  • మొత్తం రికవరీలు: 3,36,83,581

  • మొత్తం మరణాలు: 4,58,880

  • మొత్తం వ్యాక్సినేషన్: 1,06,85,71,879


Also Read:  దేశంలో భారీగా తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 10 వేల కేసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి