ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అసభ్య పదజాలంతో టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లింది. మంగళవారం దిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రతిష్టకు భంగం కలిగించేలా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని రాష్ట్రపతికి వివరించామని తెలిపారు. సీఎంని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని తెలిపామన్నారు. టీడీపీ గుర్తింపు రద్దుచేయాలని కోరామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ బూతుల కల్చర్ పోత్సహిస్తుందని, అదొక తెలుగు బూతుల పార్టీ అని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితుల్లో టీడీపీ లేదన్నారు. 






Also Read: లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యాన్ని సాధించలేకపోయిన వైఎస్ఆర్‌సీపీ ! ఓటింగ్ తగ్గడమే కారణం !


తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన పార్టీ టీడీపీ


చంద్రబాబు తన పార్టీ అధికార ప్రతినిధులు, ఇతర నేతలతో ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ ను అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ... రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదులు చేశారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను రాష్ట్రపతికి వివరించామన్నారు. చంద్రబాబు తన రాజకీయ స్వప్రయోజనాల కోసం దిల్లీ వచ్చారన్నారు. తన స్వార్థం కోసం రాష్ట్ర పరువు, ప్రతిష్టలను, ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. టీడీపీ అధికార ప్రతినిధితో చంద్రబాబు మాట్లాడించిన బో**కే అనే పదాన్ని రాష్ట్రపతి దగ్గర తెలపాలంటే తమకు ఇబ్బంది అనిపించిందన్నారు. ఆయన అర్థం చేసుకుని, సీఎంని ఇంత దారుణంగా  మాట్లాడారా.. అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారన్నారు. చంద్రబాబు తిట్టించిన ఆ పదాన్ని రాష్ట్రపతి దృష్టికి, ఇతర నేతల దృష్టికి గానీ చంద్రబాబు తీసుకువెళ్లారా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించింది. 


Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... తెలంగాణలో 6, ఏపీలో 3 స్థానాల్లో ఎన్నికలు


ప్రత్యేక చట్టం తీసుకురావాలి 


టీడీపీ సంస్కార హీన పార్టీగా మారిందని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. గత రెండేళ్లుగా ప్రతీ ఎన్నికలో టీడీపీ ఘోరంగా ఓడిపోతున్న కారణంగా ఆ పార్టీ నేతల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుందన్నారు. దీంతో తమ పార్టీ నేతల చేత బూతులు మాట్లాడించి, ప్రత్యర్థులను రెచ్చగొట్టి, కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. బద్వేల్ ఉపఎన్నిక వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించిందని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలో పోటీ చేసే ధైర్యం కూడా టీడీపీ చేయలేకపోయిందన్నారు. టీడీపీ అంతర్థానం కాబోతుందని విమర్శించారు. ఎన్నడూలేనిది చంద్రబాబు రాష్ట్రంలో రాజకీయాల్లో వికృత ధోరణల్ని ప్రవేశపెట్టి ప్రోత్సహిస్తున్నారన్నారు. అందులో భాగంగానే గంజాయి, హెరాయిన్, అఫ్గానిస్థాన్ అని నోటికొచ్చింది మాట్లాడుతున్నారన్నారు.  న్యాయమూర్తులకు కంటెప్ట్ ఆఫ్ కోర్టు యాక్ట్ 1971లాగా రాజ్యాంగ హోదాలో ఉన్నవారి పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యాలు చేస్తే చట్టబద్ధంగా చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని రాష్ట్రపతిని కోరామని వైసీపీ ఎంపీల బృందం తెలిపింది. గత ఏడాదిన్నరగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్న చంద్రబాబు ఒక టెర్రరిస్ట్ గా అసభ్యకరమైన మాటలు మాట్లాడిస్తున్నారన్నారు. ఇప్పుడు టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితే లేదని ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. 


Also Read: బద్వేలులో వైఎస్ఆర్‌సీపీ విజయం.. మెజార్టీ 90,089 !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి