స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ఇప్పుడు ఓ సమస్యలో పడిందని తెలుస్తోంది. సుకుమార్ దర్శకుడిగా.. బన్నీ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'పుష్ప'. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగాన్ని డిసెంబర్ 17న ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. 'అల.. వైకుంఠపురములో' సినిమా తరువాత బన్నీ క్రేజ్ బాలీవుడ్ కి పాకింది. నేషనల్ వైడ్ గా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఆయన స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఆయనకు క్రేజ్ పెరగడంతో 'పుష్ప' సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. 


Also Read: మాస్ మహారాజా ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?


అయితే ఇప్పుడు ఈ సినిమా హిందీ రిలీజ్ కి ఓ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. 'పుష్ప' సినిమా లాంచ్ సమయంలో మైత్రి మూవీస్ సంస్థ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను అలవాటు ప్రకారం.. ఓ బయ్యర్ కు అమ్మేశారు. ఆ తరువాత పాన్ ఇండియా రిలీజ్ అనుకోవడంతో చిక్కొచ్చిపడింది. హిందీ డబ్బింగ్ రైట్స్ కొనుకున్న వ్యక్తి థియేట్రికల్ రిలీజ్ కు అంగీకరించడం లేదు. దీంతో బన్నీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. 


దీంతో మైత్రి అధినేతలు హిందీ డబ్బింగ్ హక్కులు కొనుక్కున్న వ్యక్తితో డిస్కషన్లు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కొన్ని షరతుల మీద సినిమా హిందీ విడుదలకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అలా చేయడం వలన ఆదాయం ఎలా ఉంటుందనే సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికైతే మైత్రి మూవీస్ కి అదనపు ఖర్చు తప్పదని తెలుస్తోంది. పబ్లిసిటీ, థియేటర్ ఎక్స్ పెండిచర్ అన్నీ కూడా మైత్రి పెట్టుకొని.. పర్సంటేజ్ ఇస్తే థియేట్రికల్ రిలీజ్ కు అంగీకరిస్తానని డబ్బింగ్ రైట్స్ కొన్న వ్యక్తి కండీషన్ పెట్టినట్లు సమాచారం. 


ప్రస్తుతం దీనికి సంబంధించిన డిస్కషన్లు జరుగుతున్నాయి. మైత్రి అన్ని షరతులకు ఒప్పుకుంటే సినిమా హిందీ రిలీజ్ ఉంటుంది. లేదంటే అగ్రిమెంట్ ప్రకారం.. యూట్యూబ్ లో సినిమాను విడుదల చేయాల్సివుంటుంది. ఈ విషయంలో బన్నీ కూడా ఏం చేయలేని పరిస్థితి. మరి హిందీ రిలీజ్ సంగతి ఏమవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రెండు పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. త్వరలోనే మూడోపాటను రిలీజ్ చేస్తారని సమాచారం. 


Also Read: ప్రజెంట్ 'గాడ్ ఫాదర్'... 15 నుంచి 'భోళా శంకర్'... మెగాస్టార్ స్పీడు మామూలుగా లేదుగా!


Also Read: సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'... యాంగ్రీ స్టార్ తగ్గేదే లే!


Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గ‌మ‌నించారా!? 


Also Read: ఆర్ఆర్ఆర్... బ్రదర్ & బావా... 45 సెకన్లలో ఎలా?


Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి