ఉత్తర్‌ప్రదేశ్ జికా వైరస్‌తో వణుకుతోంది. కొత్తగా 30 జికా వైరస్ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం జికా వైరస్ కేసులు 66కు పెరిగాయి. ఈ మేరకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. నేపాల్ సింగ్ వెల్లడించారు.


అక్టోబర్ 25న కాన్పుర్‌లో తొలి జికా వైరస్ కేసు నమోదైంది. ఆ తర్వాత కేంద్రం ఓ నిపుణుల కమిటీని ఉత్తర్‌ప్రదేశ్‌కు పంపింది. అయితే జిల్లాలో బుధవారం మరో 25 మందికి వైరస్ సోకింది. ఇందులో ఆరుగురు వాయుసేన అధికారులు కూడా ఉన్నారు. కొత్త కేసుల్లో 14 మంది మహిళలు ఉన్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ విశాఖ్ తెలిపారు.


మొత్తం 586 బ్లడ్ శాంపిళ్లను లఖ్‌నవూలోని కేజీఎమ్‌యూకు పంపగా అందులో 25 పాజిటివ్‌గా తేలాయి.


వేగంగా..


జికా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య, పురపాలక శాఖ అధికారులతో కలిసి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. మొత్తం 150 బృందాలతో శానిటేషన్‌, ఫాగింగ్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. జికా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో స్థానికులెవరూ భయాందోళనకు గురి కావద్దని డీఎం విశాఖ్ సూచించారు. వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


ఏంటీ వైరస్..?





జికా వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని రీసస్‌ కోతిలో గుర్తించారు. ఈ వ్యాధి 1954లో నైజీరియాలో బయటపడింది. అనేక ఆఫ్రికన్‌ దేశాలు, ఆసియాలోని భారత్, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పైన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో కూడా ఈ వ్యాధి ప్రబలింది. జికా వైరస్‌ 2016 ఫిబ్రవరి వరకు 39 దేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రజా ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించింది. ఈ వ్యాధికి ఎడిస్‌ ఈజిప్టి, ఎడిస్‌ ఆల్బోపిక్టస్‌ రకం దోమలు వాహకాలుగా పనిచేస్తాయి.


ఎలా వ్యాపిస్తుంది?


ఈ వైరస్ కలిగిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది. అంతేకాకుండా లైంగికంగా సంక్రమించే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. గర్భిణులకు ఈ వ్యాధి సోకితే పుట్టబోయే పిల్లలకూ వ్యాపించే అవకాశం ఉంది. ఈ పిల్లలు మైక్రోసెఫాలి (తల చిన్నగా ఉండటం) అనే లక్షణంతో ఉంటారు.


లక్షణాలేంటి..?


జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కండ్లకలక, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు, లింఫ్ గ్రంథులు ఉబ్బడం లాంటి లక్షణాలు కనబడతాయి.


Also Read: Virat Kohli Birthday: 'కోహ్లీ.. నీ గురించి లోకానికి అరిచి చెప్పాలని ఉంది..' విరాట్‌కు అనుష్క స్పెషల్ విషెస్


Also Read: PM Modi Kedarnath Visit: కేదార్‌నాథ్‌ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు.. శంకరాచార్యుని విగ్రహం ఆవిష్కరణ


Also Read: PAK vs NAM, Match Highlights: సెమీస్ కు పాక్‌.. వరుసగా నాలుగో విక్టరీ! నమీబియాకు హ్యాట్సాఫ్‌.. కాసేపు వణికించారు!


Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ


Also Read: SA vs BANG, Match Highlights: సెమీస్‌ రేసులో సఫారీలు..! బంగ్లా 84కే చిత్తు.. 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విక్టరీ


Also Read: Ind vs NZ T20 Series: టీమ్‌ఇండియాలో భారీ మార్పులు.. న్యూజిలాండ్‌ టీ20 సిరీసుకు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి