"సీఐడీ" అనే సీరియల్‌ను చూడని వారు తక్కువ.  పిల్లలను కూడా అమితంగా ఆకట్టుకుంటుంది. అందులో నేరాలు జరిగే తీరు.. వాటిని సీఐడీ టీమ్ పట్టుకోవడమే ఈ సీరియల్ స్టైల్. అయితే ఇప్పటి వరకూ ఆ సీరియల్‌ను చూసి హంతకులు, గొందలను పట్టుకున్నారనే ఉదంతాలు వెలుగు చూశాయి కానీ.. ఆ సీరియల్‌ను చూసి ఇన్‌స్పయిల్ అయి దొంగతనాలు, హత్యలు చేశారన్న ఉదంతాలు వెలుగుచూడలేదు. మొదటి సారి అలాంటిది పుణెలో చోటు చేసుకుంది. 


Also Read : గంటల వ్యవధిలో 20 మంది మృతి.. ఏం జరిగి ఉంటుంది?


దేశం అంతా దీపావళి పండుగ హడావుడిలో ఉన్న సమయంలో పుణెలో ఓ 70 ఏళ్ల వృద్ధురాలు అత్యంత పాశవికంగా హత్యకు గురయింది. ఆమె పేరు షాలిని బద్నారావు సోనావానే.  పుణెలోని సయాలి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుండేది. హఠాత్తుగా ఆమె హత్యకు గురైంది. ఎవరు ఈ పని చేశారా అని సీసీ ఫుటేజీ ఇతర ఆధారాలు చూసిన పోలీసులు మైండ్ బ్లాంక్ అయింది. ఇద్దరు మైనర్లు వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లడం రికార్డ్ అయింది. ఇంట్లో టీవీ చూస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి.. రూ. లక్షన్నర వరకూ నగదు, బంగారం దోచుకుని అక్కడ్నుంచి పరారయ్యారు. ఆ దృశ్యాలు కూడా సీసీ కెమెరాలకు చిక్కాయి. 


Also Read: Hyderabad: పెళ్లి చూపులకు వెళ్లిన యువకుడు.. నచ్చలేదన్న యువతి, ఇంటికొచ్చాక భారీ షాక్


ఆ ఇద్దరు మైనర్ల గురించి ఆరా తీస్తే కీలక విషయాలు పోలీసులకు తెలిశాయి. నిందితులిద్దరు వృద్ధురాలి ఇంటికి సమీపంలోనే ఉండేవారు. వృద్ధురాలు ఒక్కతే ఒంటరిగా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుందని గ్రహించారు. ఆమె ఇంటిలో దొంగతనం చేయాలని భావించారు. ఆ ప్రకారం పని పూర్తి చేశారు. వారికి ఈ ఐడియా ఎలా వచ్చింది అంటే ఆ ఇద్దరూ సీఐడీ సీరియల్‌ను విపరీతంగా చూసేవారట. అచ్చంగా వృద్ధురాలిని చంపేసి నగదు దోచుకున్న వైనంలో ఉన్న ఎపిసోడ్ వారు పదే పదేచూసేవారని పోలీసులు సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. సేమ్ టు సేమ్ సీఐడీ సీరియల్‌లోలాగానే వృద్ధురాలిని చంపి డబ్బులు దోచుకెళ్లడంతో  అదే ఇన్‌స్పిరేషన్ అని పోలీసులు డిసైడయ్యారు. 


Also Read: Horrors of Hotel Room 308: రూమ్ నెం.308 మిస్టరీ.. శృంగారంలో అపశృతి.. ప్రధాని క్షమాపణలు, అసలేం జరిగింది?


నిందితులు ఇద్దరు ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. వారి కోసం గాలిస్తున్నారు. ఇద్దరూ మైనర్లు కావడంతో సీఐడీ సీరియల్ తరహా ఆలోచనలతోనే దాక్కుని ఉంటారని ఆ కోణంలోనే వారు ఎక్కడెక్కడ ఉంటారో పోలీసులు వెదుకుతున్నారు.


Also Read: Anantapur: రోకలి బండతో కొట్టి భర్తను చంపిన భార్య.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి