పెళ్లి చూపులకు వెళ్లాక యువతి నచ్చలేదని చెప్పేయడంతో చిన్నబుచ్చుకున్న యువకుడు సైబర్ నేరాలకు ఒడిగట్టాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోనే చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన ఆయన యువతి తనను కాదన్నదనే ఉద్దేశంతో ఆమెను సామాజిక మాధ్యమాల ద్వారా ఇబ్బందులకు గురి చేశాడు. చివరికి పోలీసుల వరకూ విషయం వెళ్లడంతో వారు విచారణ జరిపి కారకుడైన వ్యక్తిని అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే..
సోషల్ మీడియాలో యువతిని వేధిస్తున్నాడని ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బోడుప్పల్ ప్రాంతానికి చెందిన యువతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆమెకు ఇంట్లో పెద్దవారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ మ్యాట్రిమోనీ సైట్‌లో తన ప్రొఫైల్ నమోదు చేసుకుంది. దాని ద్వారానే ఓ కుటుంబం పరిచయం అయింది. ఆమె మ్యాట్రిమోనీలో నెల్లూరుకు చెందిన సాయి కుమార్ అనే 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పరిచయం అయ్యాడు. మ్యాట్రిమోనీలో ఫొటోను చూసిన అతడు తన తల్లిదండ్రులతో కలిసి పెళ్లి చూపులకు యువతికి ఇంటికి వచ్చారు. తొలుత ఇద్దరు మాట్లాడుకోవడం వల్లే యువకుడి తల్లిదండ్రులు పెళ్లి చూపులకు వచ్చేందుకు అంగీకారం కుదిరింది.
Also Read: మూడు లారీలు.. ఐదు కోట్లు.. లైఫ్ సెటిలైనట్లేననుకున్నారు ఆ కానిస్టేబుళ్లు ! కానీ ...
పెళ్లి చూపులు ముగిశాక ఆ సంబంధం తనకు నచ్చలేదని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలా కుటుంబం మొత్తం పెళ్లి చూపులకు వచ్చాక కాదనడంతో యువకుడు కోపం పెంచుకున్నాడు. దాంతో కక్ష్య పెంచుకున్న సాయి కుమార్ ఫేస్ బుక్‌లో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆ యువతి ఫొటోలు, ఫోన్ నెంబర్‌ను పెట్టి అసభ్యకరంగా పోస్టులు చేశాడు. దీంతో ఆ యువతి కంగుతిన్నది. అదేంటని ప్రశ్నించగా.. యువతిని మానసికంగా కూడా వేధించాడు. దీంతో తట్టుకోలేని యువతి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం సాయి కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read : బైక్ పై లవర్ మృతదేహం తరలింపు... హత్యా లేక ప్రమాదమా?
Also Read: అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య... 80 కిలోమీటర్లు వెంబడించి కాల్పులు
Also Read: భర్త నిద్రిస్తున్న వేళ ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య.. కాసేపట్లోనే ఘోరం
Also Read: రూమ్ నెం.308 మిస్టరీ.. శృంగారంలో అపశృతి.. ప్రధాని క్షమాపణలు, అసలేం జరిగింది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి