మూడు లారీలకు ఎస్కార్ట్‌గా ఉండి సేఫ్‌గా డెస్టినేషన్‌కు చేరిస్తే రూ. ఐదు కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చింది. వెంటనే ఆ కానిస్టేబుళ్లకు రూ. ఐదు కోట్లు అంటే ఎంత అని లెక్కలేసుకుని జీవితంలో సంపాదించలేనంత అని అర్థం చేసుకుని వెంటనే.. ఓకే చేప్పేశారు. ఆ లారీల్లో ఏముంటుందో కూడా వారికి తెలుసు. కానీ కళ్ల ముందు కనిపిస్తున్న కోట్ల ముందు ఆ లారీల్లో ఏముందనేది వారికి పట్టలేదు. ఫలితంగా ఇప్పుడు అసలు జీవితమే రిస్క్‌లో పడిపోయింది. ఇదంతా ఖమ్మం జిల్లా కానిస్టేబుళ్ల గురించే. 


Also Read : బైక్ పై లవర్ మృతదేహం తరలింపు... హత్యా లేక ప్రమాదమా?


విశాఖ మన్యం ప్రాంతం నుంచి తెలంగాణలోకి పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ అవుతూ ఉంటుంది. ఏపీలో నిఘా తక్కువ. కానీ తెలంగాణ దగ్గరకు వచ్చే సరికి పటిష్టమైన నిఘా ఉంటుంది. భద్రాచలం సమీపంలోని తెలంగాణ సరిహద్దు ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేసే విషయంలో స్మగ్లర్లు ఏకంగా పోలీసులతోనే డీల్ కుదుర్చుకున్నారు. ఐదుగురు కానిస్టేబుళ్ల గంజాయి లోడ్లతో ఉన్న మూడు లారీల్ని హైదరాబాద్ వరకూ చేర్చితే రూ. ఐదు కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. కానిస్టేబుళ్లు అంగీకరించారు. మొదటగా ఓ లారీని సేఫ్‌గా చేర్చాల్సిన చోటికి చేర్చారు. కానీ రెండో లారీని చేర్చే క్రమంలో పట్టుబడిపోయారు. దీంతో కథ అడ్డం తిరిగిపోయింది.


( పోలీసులకు చిక్కిన కానిస్టేబుల్ )



  Also Read: అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య... 80 కిలోమీటర్లు వెంబడించి కాల్పులు



ఐదుగురు కానిస్టేబుల్స్‌లో ఒకరిని పట్టుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. పట్టుబడిన వ్యక్తి ఏఆర్‌ కానిస్టేబుల్‌ సతీష్‌.  అతనిని ప్రశ్నించిన మిగిలిన నలుగురు కానిస్టేబుళ్ల వివరాలు బయటకు తీస్తున్నారు. ఆ కానిస్టేబుల్‌ నుంచి అసలు స్మగ్లర్లు ఎవరనేదానిపై ఆరా తీస్తున్నారు. ఇంకా ఎంత మంది ఈ అక్రమ రవాణాలో పాలుపంచుకున్నారు, ఎవరెవరు ఉన్నారనే విషయంపై ఖమ్మం పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.


Also Read:  భర్త నిద్రిస్తున్న వేళ ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య.. కాసేపట్లోనే ఘోరం


( పరారీలో ఉన్న కానిస్టేబుల్ సోషల్ మీడియా ప్రోఫైల్ ఫోటో )


 


తెలంగాణలోకి గంజాయి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రకారం పోలీసులు నిఘా పటిష్టం చేశారు. ఈ క్రమంలో ఎందరో దొరుకుతున్నారు. పోలీసులు కూడా దొరకడం అనూహ్యం. ఈ ముఠాపై ఒకటి రెండు రోజుల్లో ఉన్నతాధికారులు అసలు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. 


Also Read: రూమ్ నెం.308 మిస్టరీ.. శృంగారంలో అపశృతి.. ప్రధాని క్షమాపణలు, అసలేం జరిగింది?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి