వ్యాక్సినేషన్ కవరేజీ తక్కువగా ఉన్న 40 జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంచేశామని అజాగ్రత్త వహిస్తే మరో సంక్షోభం ముంచుకొచ్చే ప్రమాదం ఉందన్నారు. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో ఝార్ఖండ్, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ సహా పలు రాష్ట్రాలకు చెందిన జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మోదీ మాట్లాడారు. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేసేందుకు పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా రాష్ట్రాలు 100 శాతం రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లేకుంటే మరో కొత్త సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని మోదీ అన్నారు.
ఇటీవలే ఇటలీ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. జీ20 సహా వాతావరణ సదస్సులో పాల్గొన్నారు. పర్యటన ముగించుకుని దిల్లీ చేరుకున్న వెంటనే ఈ సమావేశం నిర్వహించారు. ఇటీవల భారత్ వ్యాక్సినేషన్‌లో అరుదైన మైలురాయిని చేరుకుంది. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది.
Also Read: Vaccine for Children: చిన్నారుల వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం.. బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: Deepotsav in Ayodhya: అయోధ్యలో దీపోత్సవం.. గిన్నిస్ ప్రపంచ రికార్డ్ వెయిటింగ్!
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 11,903 కేసులు నమోదు.. 252 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also read: రోజుకో అరటిపండు చాలు... ఆ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు
Also read:పిల్లలు ఎత్తు పెరగాలా... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి