5-11 ఏళ్ల లోపు పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు అమెరికా సిద్ధమైంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచనల మేరకు పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు బైడెన్ సర్కార్ రెడీ అయింది.






ఇటీవల ఫైజర్- బయోటెక్ కొవిడ్ వ్యాక్సిన్‌ను పిల్లలకు వేసేందుకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినేస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చింది. ఈ ఆదేశాలకు సీడీసీ కూడా మద్దతు తెలపడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లలను కొవిడ్ వ్యాప్తి నుంచి కాపాడేందుకు వ్యాక్సిన్ తప్పనిసరని భావిస్తోంది.


12 ఏళ్ల పైబడినవారికి ఇచ్చే వ్యాక్సిన్ డోసు మోతాదు 30 మైక్రోఆర్గామ్స్‌ కాగా పిల్లలకు 10 మైక్రోఆర్గామ్ డోసు ఇవ్వాలని నిర్ణయించారు. పిల్లలపై తమ వ్యాక్సిన్ 90.7 శాతం సమర్థతను కనబరుస్తుందని ఫైజర్-బయోటెక్ ప్రకటించింది. 


కరోనాపై అమెరికా చేస్తోన్న పోరాటంలో ఇదో గొప్ప మలుపుగా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. ఈ టీకాను రెండు డోసుల్లో ఇవ్వనున్నట్లు తెలిపారు.


5-11 ఏళ్ల పిల్లలకు శిశువైద్యుల కార్యాలయాలు, స్థానిక ఫార్మసీలు, వారి పాఠశాల్లోనూ ఫైజర్‌ టీకాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ వారం నుంచి పిల్లల వ్యాక్సిన్ కార్యక్రమం జరగనుంది.


Also Read: Deepotsav in Ayodhya: అయోధ్యలో దీపోత్సవం.. గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌ వెయిటింగ్!


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 11,903 కేసులు నమోదు.. 252 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు


Also read: రోజుకో అరటిపండు చాలు... ఆ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు


Also read:పిల్లలు ఎత్తు పెరగాలా... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే


Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి