26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా ‘మేజర్’. గూఢచారి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అడవి శేష్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తైన సందర్భంగా విడుదల తేదీ ప్రకటిస్తూ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ట్విట్టర్లో స్పందించిన అడవి శేష్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం - ప్రేమ - లెగసీ నుంచి ప్రేరణ పొందిన భారీ చిత్రమని ట్వీట్ చేశారు. అడివి శేష్ ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేయడమే కాదు కథ - స్క్రీన్ ప్లే బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం స్వయంగా ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులను కలిసి వారి అనుమతి తీసుకున్నారు. ఇప్పటికే విడుదలైన 'మేజర్' పోస్టర్స్, టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి.
75 లొకేషన్లలో 120 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కోసం 8 భారీ సెట్లు నిర్మించారు. అడివి శేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఇది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో GMB ఎంటర్టైన్మెంట్ , A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇందులో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల - బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ‘మేజర్’2022 ఫిబ్రవరి 11న తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Also Read: పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్
Also Read:సన్నీ లియోనీ.. తగ్గేదే లే! ఆమె పేరుతో బ్లాక్‌చైన్‌తో రూపొందించే ఎన్‌ఎఫ్‌టీ.. ఇదో మరో రికార్డు!
Also Read: సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్... శ్రీరామచంద్రకు టార్చర్
Also Read: మానస్ ని సేవ్ చేసిన యానీ మాస్టర్.. ప్రియాంక ఫైర్..
Also Read: 'అభిమానులు అనాలా..? ఆర్మీ అనాలా..?'.. 'ఆహా 2.0' ఈవెంట్ లో బన్నీ..
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి