బాలీవుడ్‌ తార సన్నీ లియోన్‌ నాన్ ఫంగీబుల్‌ టోకెన్స్‌ (NFT) మార్కెట్‌ ప్లేస్‌లోకి అడుగు పెట్టింది. ఈ ఘనత అందుకున్న భారత తొలి నటిగా గుర్తింపు అందుకుంది.


ఎన్‌ఎఫ్‌టీ అంటే నాన్‌ ఫంగీబుల్‌ టోకెన్స్‌. ఇవీ ఒకరకమైన డిజిటల్స్‌ అసెట్స్‌. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని ఉపయోగించి ఓనర్‌షిప్‌ ఇస్తారు. చిత్రాలు, వీడియోలు, ఇతర సేకరణలను ఎన్ఎఫ్‌టీలుగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్లే మరెవ్వరూ దీనిపై ఓనర్‌షిప్‌ క్లైమ్‌ చేసుకోలేరు. అలా చేయాలంటే వాటిని కొనుగోలు చేయాల్సిందే.


ప్రస్తుతం ఎన్‌ఎఫ్‌టీలపై క్రేజ్‌ పెరుగుతోంది. వీటిని సేకరణ కర్తలు, ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. సెకండరీ మార్కె్ట్లో విక్రయించుకోవచ్చు. ఎన్‌ఎఫ్‌టీలను ప్రత్యేకంగా తయారు చేయాలా? కొద్ది మందికే విక్రయించాలా అన్నది క్రియేటర్‌ ఇష్టం. ఈ నేపథ్యంలో తన తొలి ఎన్‌ఎఫ్‌టీ గురించి సన్నీ లియోన్‌ ట్వీట్‌ చేసింది. 


'మిస్‌ ఫిజ్‌ను కలవండి! ఇది మిస్‌ ఫిజ్‌ హనీ! ఆమెకు గులాబీ రంగంటే ఇష్టం. టాటూలు వేయించుకున్న కుర్రాళ్లన్నా ఇష్టమే. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు? సన్నీలియోన్‌ ఎన్‌ఎఫ్‌టీలు సిద్ధంగా ఉన్నాయి' అని సన్నీ ట్వీట్‌ చేసింది. 'ఇదో ప్రైవేట్‌ సేల్‌. వెంటనే విక్రయిస్తాం. నా కలెక్షన్‌పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. చాలామంది సపోర్ట్‌ చేస్తున్నారు. నేనెలాగూ మిస్‌ఫిట్‌నే' అని ఆమె మీడియాకు తెలిపింది. ఇంతకు ముందే అమితాబ్‌ బచ్చన్, సల్మాన్‌ ఖాన్‌ ఎన్‌ఎఫ్‌టీ రంగంలోకి రావడం గమనార్హం.










ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి