ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన రఘువీరారెడ్డి.. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని వ్యవసాయం చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. రైతుగా కనిపించిన ఆయన అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఇటీవల ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ ఫొటోలు షేర్ చేసుకున్నారు. డా.రఘువీరారెడ్డి తాజాగా మరోసారి ఆసక్తికర పోస్టు చేశారు. ఆయన మనవరాలు సమైరా రఘువీరారెడ్డిని స్తంభానికి కట్టిపడేసి తనతో ఆడుకోవడానికి ఇంట్లో ఉండాలని డిమాండ్ చేసిందంటూ పోస్టు చేశారు. ఈ విషయాన్ని రఘువీరా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 


Also Read: "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?






నెటిజన్లు ప్రశంసలు


తనతో ఆడుకోడానికి సమయం కేటాయించడంలేదని అలిగిన రఘువీరారెడ్డి మనవరాలు సమైరా తనను తాళ్లతో స్థంభానికి కట్టి వేసిందన్న ఫొటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. రఘువీరారెడ్డి డౌన్ టు ఎర్త్ అంటూ ప్రశంసిస్తున్నారు. తాళ్లతో కట్టేసి మరీ తనతో ఆడుకోమని డిమాండ్‌ చేయడం బాగుందన్నారు. రఘువీరారెడ్డి ఉమ్మడి ఏపీలో మంత్రిగా సేవలు అందించి, విభజన అనంతపురం నవ్యాంధ్రప్రదేశ్ కు పీసీసీ చీఫ్‌గా వ్యవహరించారు. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుని సాధారణ రైతుగా జీవితాన్ని గడుపుతున్నారు. 




(రఘువీరారెడ్డి మనవరాలు సమైరా)


Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... తెలంగాణలో 6, ఏపీలో 3 స్థానాల్లో ఎన్నికలు


సాధారణ రైతులా జీవనం సాగిస్తున్న రఘువీరా 


రఘువీరారెడ్డికి వివాద రహితుడు, సౌమ్యుడిగా పేరుంది. కొన్నాళ్లుగా పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్న రఘువీరారెడ్డి వ్యవసాయం చేస్తూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు తన సతీమణితో కలిసి బైక్ లో వచ్చారు. అంతక ముందు పొలంలో ట్రాక్టర్ తో దమ్ము చేస్తూ కనిపించారు. రఘువీరా తన సొంతూరు సమీపంలోని వాగుకు గండి పడితే దానికి అడ్డుకట్ట వేసేందుకు స్థానిక రైతులతో కలిసి ఇసుక బస్తాలు కూడా మోశారు. రఘువీరా ఫొటోలు ఈ మధ్య కాలంలో వైరల్ అవుతున్నాయి. ఆయన సాధారణ జీవనాన్ని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. రఘువీరా తన సొంత ఊరు నీలకంఠాపురంలోని 1200 ఏళ్ల కిందటి చారిత్రక నీలకంఠేశ్వరుడి గుడి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. తాజాగా ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఆడుకోవడం లేదనే కారణంతో రఘువీరా మనవరాలు తాడుతో స్తంభానికి కట్టేసిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.






Also Read: బద్వేలులో వైఎస్ఆర్‌సీపీ విజయం.. మెజార్టీ 90,089 !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి