టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ మళ్లీ రీ ఎంట్రీ చేయబోతున్నాడా? భారత క్రికెట్ తరఫున తిరిగి క్రికెట్ ఆడబోతున్నాడా? బ్యాటు పట్టుకొని అభిమానులను మురిపించనున్నాడా? అతడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది!
రెండేళ్ల క్రితం యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌కూ దూరమయ్యాడు. అయితే క్రికెట్ మీద ఇష్టంతో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని క్రికెట్ లీగుల్లో ఆడాడు. అబుదాబి టీ10, జీటీ20 క్రికెట్ లీగుల్లో అదరగొట్టాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారి మొదలవ్వడంతో ఇంట్లోనే ఉన్నాడు. అయితే పంజాబ్ క్రికెట్ సంఘం కోరిక మేరకు రంజీ జట్టుకు శిక్షణ ఇచ్చాడు. యువ క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, అర్షదీప్ సింగ్, అభిషేక్ శర్మ వంటి క్రికెటర్లకు మెంటార్‌గా వ్యవహరించాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా వరుసగా రెండు ఓటములు చవిచూడటంతో జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ అతడు మాత్రం జట్టుకు అండగా నిలిచాడు. 2022 ఫిబ్రవరిలో మళ్లీ మైదానంలో అడుగు పెట్టబోతున్నా అంటూ ప్రకటించాడు.
'మన విధిని దేవుడు మాత్రమే నిర్ణయిస్తాడు!! ప్రజల కోరిక మేరకు ఫిబ్రవరిలో పిచ్‌పై తిరిగి అడుగు పెడతాను! ఇంతకన్నా గొప్ప ఫీలింగ్ మరొకటి లేదు! మీ ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. టీమ్‌ఇండియాకు అండగా ఉండండి. ఇది మన జట్టు. నిజమైన అభిమానులు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడే అండగా ఉంటారు. జైహింద్' అని యువీ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.
ఈ పోస్టు చూసిన తర్వాత యువరాజ్ ఏం చేస్తాడా అన్న ఆసక్తి మొదలైంది! బహుశా అతడు మళ్లీ బ్యాటు పడితే బాగుండని అభిమానులు కోరుకుంటున్నారు. లేదా అతడు టీమ్‌ఇండియాకు బ్యాటింగ్ కోచ్‌గా ఏమైనా వస్తాడా? లేదా కోచింగ్ స్టాఫ్‌లో ఏదైనా పాత్ర తీసుకుంటాడా? టీమ్‌ఇండియాలో ఫియర్‌లెస్ మెంటాలిటీని రూపొందించేందుకు అతడిని గంగూలీ బరిలోకి దించుతున్నాడా? చూడాల్సి ఉంది.
Also Read: Eng Vs SL , Match Highlights: లంకపై పేలిన బట్లర్ బాంబ్.. 26 పరుగులతో ఇంగ్లండ్ విజయం
Also Read: T20 Worldcup 2021: టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లేనా.. ఇది న్యాయమేనా?