మే 13, 2022... హీరోయిన్ రష్మికా మందన్నాకు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకని అనుకుంటున్నారా? ఆ రోజే కథానాయికగా ఆమె తొలి హిందీ సినిమా 'మిషన్ మజ్ను' విడుదల కానుంది. హిందీలో సినిమా చేయకముందే రష్మికా మందన్నాకు ఉత్తరాదిన బోలెడు క్రేజ్ వచ్చింది. 'నేషనల్ క్రష్' అని కొందరు ఆకాశానికి ఎత్తేశారు. ఆ క్రేజ్ వేరు. సినిమా సక్సెస్ అవ్వడం వేరు, సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడం వేరు. అందుకని, ఆ రోజు రష్మికకు చాలా ఇంపార్టెంట్.
'మిషన్ మజ్ను'లో సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. అతనికి జోడీగా రష్మిక కనిపించనుంది. వీళ్లిద్దరి జోడీకి ఉత్తరాది ప్రేక్షకుల్లో మంచి పేరొచ్చింది. ఒకవేళ ఈ సినిమా హిట్ అవ్వకపోయినా... రష్మికకు పర్వాలేదు. హిందీలో ఆల్రెడీ ఆమె రెండో సినిమా చేస్తోంది. అమితాబ్ బచ్చన్, ఆమె ప్రధాన పాత్రల్లో 'గుడ్ బై' తెరకెక్కుతోంది. మరో సినిమా చేతిలో ఉన్నప్పటికీ... ఫస్ట్ సినిమాతో సక్సెస్ అందుకుంటే ఆ కిక్కే వేరు. పైగా, హిందీ సినిమాల కోసం ముంబైలో రష్మిక ఓ ఫ్లాట్ కూడా కొన్నారు. హిందీ సినిమా షూటింగ్స్ చేసేటప్పుడు హోటల్స్ లో ఉండటం కష్టంగా ఉందని ఏకంగా ఇల్లు కొనేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అవుతానని ఆమెకు అంత నమ్మకం ఉందన్నమాట.
Also Read: ప్రజెంట్ 'గాడ్ ఫాదర్'... 15 నుంచి 'భోళా శంకర్'... మెగాస్టార్ స్పీడు మామూలుగా లేదుగా!
Also Read: జై భీం సమీక్ష: సూర్య మళ్లీ కొట్టాడు.. ఈసారి అవార్డులు కూడా!
తెలుగుకు వస్తే... అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న 'పుష్ప'లో ఆమె కథానాయిక. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషలు, హిందీలో ఆ సినిమా విడుదల కానుంది. 'పుష్ప'లో డీ-గ్లామర్ రోల్ చేస్తున్నారు. పాటలు హిట్ అవ్వడం సినిమాకు ప్లస్ అని చెప్పాలి. శర్వానంద్ సరసన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా కూడా చేస్తున్నారు. కిషోర్ తిరుమల ఆ సినిమాకు దర్శకుడు.
Also Read: మాస్ మహారాజా ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?
Also Read: సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'... యాంగ్రీ స్టార్ తగ్గేదే లే!
Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గమనించారా!?
Also Read: ఆర్ఆర్ఆర్... బ్రదర్ & బావా... 45 సెకన్లలో ఎలా?
Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!