బద్వేలు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మెరుగు పడింది. ఆ నియోజకవర్గంలో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సాధించిన ఓట్లతో పోలిస్తే ఎన్నో రెట్లు మెరుగైన ఓట్లను సాధించింది. 2019లో డిపాజిట్ కాదు కదా కనీసం నోటాతో పాటుగా ఓట్లు సాధించలేదు. పట్టు మని వెయ్యి ఓట్లను కూడా బీజేపీ సాధించలేకపోయింది. ఆ పార్టీకి వచ్చిన మొత్తం ఓట్లు 735 మాత్రమే. కానీ ప్రస్తుతం జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన ఓట్లు 21621. అంటే బాగా పుంజుకున్నట్లుగానే భావించాలి. 


Also Read : బద్వేలులో వైఎస్ఆర్‌సీపీ విజయం.. మెజార్టీ 89, 660 !


బద్వేలు నియోజకవర్గంలో బీజేపీకి పట్టు లేదు. 2019లో ఆ పార్టీ తరపున పోటీ చేసింది సాక్షాత్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన జయరాములు ఆ తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీలో టిక్కెట్ రాదని తెలిసిన తర్వాత బీజేపీలో చేరారు. టిక్కెట్ తెచ్చుకుని పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనకు కనీసం 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సారి స్థానికేతరుడు, రైల్వే కోడూరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి అచ్చంగా నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి పనతల సురేష్ ఈ సారి బద్వేలు నుంచి బరిలోకి దిగారు. అయినప్పటికీ మంచి ఓట్లను సాధించింది. 


Also Read : "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?


బద్వేలులో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. చనిపోయిన ఎమ్మెల్యే భార్యకే వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్ ఇచ్చింది కాబట్టి బరిలోకి దిగలేదు. ఈ కారణంగా వైఎస్ఆర్‌సీపీకి ఓటు వేయడానికి ఇష్టపడని వారు.. తదుపరి ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని చూశారు. నిజానికి పోలింగ్‌ బూత్‌లలో బీజేపీ తరపున కూర్చున్న వారు టీడీపీ నేతలేనని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ నేతలే బీజేపీకి ఓట్లు వేయించారని వారు విమర్శలు చేశారు. 


Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... తెలంగాణలో 6, ఏపీలో 3 స్థానాల్లో ఎన్నికలు


పైగా ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ముఖ్య నేతలు కడప జిల్లా వారే. ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ వంటి వారు కడప జిల్లాకు చెందిన వారే కావడం... బద్వేలులో టీడీపీ బరిలో లేకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఓట్లను వీలైనంత వరకూ బీజేపీకి వేయించగలిగారని తెలుస్తోంది.  ఎలా చూసినా లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ఆర్‌సీపీకి బీజేపీ కాస్త అడ్డుకట్ట వేయగలిగింది. 


Also Read: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్య రాగం... ఆ విషయంలో కేసీఆర్ కు మద్దతిస్తానని కీలక వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి