షారుఖ్ ఖాన్ తన 56వ పుట్టినరోజును నవంబర్ 2 (మంగళవారం) జరుపుకున్నారు. కింగ్ ఖాన్ కు  భారీగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దుబాయ్ ఐకానిక్ ఆకాశహర్మ్యం బుర్జ్ ఖలీఫా సాక్షిగా  షారూఖ్ ఖాన్ జన్మదిన వేడుకలు  మారుమోగిపోయాయి. 






బుర్జ్ ఖలీఫాపై షారుక్ ఫొటో కనిపించడం ఇదే మొదటి సంవత్సరం కాదు. ఈ ఏడాది ఇది చూసి స్పందించిన షారుక్ ఖాన్ గతేడాది  బుర్జ్ ఖలీఫా ముందు నిల్చున్న ఫొటో పోస్ట్ చేశారు. " ప్రపంచంలోని అతిపెద్ద, ఎత్తైన స్క్రీన్‌పై నన్ను చూసుకోవడం ఆనందంగా ఉంది. నా నెక్ట్స్ మూవీ కన్నా ముందే నా స్నేహితుడు #MohamedAlabbar నన్ను అతిపెద్ద స్క్రీన్‌పైకి తీసుకొచ్చాడు. @burjkhalifa & @emaardubai అందరికీ ధన్యవాదాలు & లవ్' అని పోస్ట్ చేశారు షారుక్. 






ఈ ఏడాది డ్రగ్స్ కేసులో దాదాపు నెల రోజులు జైలు జీవితం తనయుడు ఆర్యన్ ఖాన్ ఇంటికొచ్చాడు. ఈ సందర్భంగా షారుక్ కి శుభాకాంక్షలు తెలియజేయడంత పాటూ, ఆర్యన్ ను చూసేందుకు పలువురు సెలబ్రెటీలు, భారీగా అభిమానులు  తరలివెళ్లారు. దివాలీ కూడా కావడంతో బాలీవుడ్ కింగ్  ఖాన్ ఇల్లు మొత్తం కలర్ ఫుల్ గా అలంకరించారు. ఇక  షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ గురించి తెలిసాక షారుక్ తల్లిదండ్రులు గౌరీ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించారు. తన బావమరిది గన్ గురి పెట్టి తనని చంపేస్తానని కూడా బెదిరించినా కింగ్ ఖాన్ ఏమాత్రం బెదర్లేదట. వీళ్లిద్దరూ విడిపోవాలనేంత కోపంతో గౌరీఖాన్ తల్లి అప్పట్లో పలువురు జ్యోతిష్యులను కూడా కలిసారట.  కింగ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా వీరి ప్రేమ వ్యవహారం కూడా బీటౌన్లో మరోసారి హాట్ టాపిక్ అయింది. 
Also Read: సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్... శ్రీరామచంద్రకు టార్చర్
Also Read: మానస్ ని సేవ్ చేసిన యానీ మాస్టర్.. ప్రియాంక ఫైర్..
Also Read: 'అభిమానులు అనాలా..? ఆర్మీ అనాలా..?'.. 'ఆహా 2.0' ఈవెంట్ లో బన్నీ..
Also Read: సన్నీ లియోనీ.. తగ్గేదే లే! ఆమె పేరుతో బ్లాక్‌చైన్‌తో రూపొందించే ఎన్‌ఎఫ్‌టీ.. ఇదో మరో రికార్డు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి