దీపోత్సవం కోసం అయోధ్య అందంగా ముస్తాబవుతోంది. ఆలయాలు, మార్కెట్లు, ఇళ్లు, వ్యాపార సముదాయాలు ఇలా అన్నింటిని దీపావళి వేళ అంగరంగ వైభవంగా తయారు చేస్తున్నారు. చోటీ దివాళీ సందర్భంగా ఈ రోజు అయోధ్యను దీపాలతో అలంకరించనున్నారు. అయితే ఈసారి 12 లక్షల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాలని యోగి సర్కార్ భావిస్తోంది. 






కనులపండువగా..


ఈ 12 లక్షల దీపాలలో 9 లక్షలు సరయు నది తీరాన ఉన్న రామ్ కీ పైడీ ఘాట్‌లో వెలిగించనున్నారు. మిగిలిన 3 లక్షల దీపాలు అయోధ్యలోని వివిధ మఠాల్లో వెలిగిస్తారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బృందం కూడా విచ్చేసింది.


అయితే ఇవన్నీ కనీసం 5 నిమిషాల పాటు వెలగాలి.. అప్పుడే ప్రపంచ రికార్డ్ నెలకొల్పుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు యోగి ఆదిత్యనాథ్ అయోధ్య చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు ఆయన రామ్ కీ పైడీ ఘాట్‌లో సరయు హారతి ఇస్తారు. అనంతరం 6 గంటల నుంచి దీపోత్సవం జరగనుంది.


ఐదు దీపాలు..


ఈ కార్యక్రమాన్ని చూసేందుకు అయోధ్య ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సోమవారం ప్రారంభమైన ఈ దీపోత్సవ కార్యక్రమం ఐదురోజుల పాటు సాగనుంది. ఈరోజు కార్యక్రమంలో అయోధ్యలోని ప్రతి గ్రామం నుంచి ఓ ఐదు దీపాలు ఇక్కడ వెలిగిస్తారు. 


భారీ భద్రత.. 


ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యోగి సర్కార్ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. అయోధ్యలోని ప్రతి గల్లీలో పోలీసులు కాపు కాస్తున్నారు. ఎక్కడికక్కడ బారీకేడ్లను ఏర్పాటు చేశారు. ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని 2017 నుంచి చేస్తున్నారు. 2017లో 51 వేల దీపాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 11,903 కేసులు నమోదు.. 252 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు


Also read: రోజుకో అరటిపండు చాలు... ఆ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు


Also read:పిల్లలు ఎత్తు పెరగాలా... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే


Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి