ఒకే నెంబరుతో రెండు వాహనాలు ఉండడం నేరం అనే సంగతి తెలిసిందే. సాధారణంగా నేరస్థులు, పోలీసులను బురిడీ కొట్టించాలనుకొనే దొంగలు ఇలాంటి పనులు ఎక్కువగా చేస్తుంటారు. ఒకే నెంబరుతో రెండు లేదా మూడు వాహనాలు ఉన్నాయంటే.. అవి సక్రమంగా రిజిస్ట్రేషన్ కానట్లే లెక్క. ఎక్కువగా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ఇలాంటి పనులు చేస్తుంటాయి. అంటే ప్రభుత్వ ఆదాయం గండీ పడ్డట్లే. అయితే, ఇలాంటి పనులు నేరస్థులు చేస్తుండడం అక్కడక్కడా చూస్తుంటాం. కానీ, ఏకంగా తెలంగాణ ఆర్టీసీలో జరిగితే..! ఒకే నెంబరుతో ఏకంగా 3 ఆర్టీసీ బస్సులు కనిపించడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


ప్రభుత్వానికి చెందిన బస్సుల్లో ఇలాంటి మాయాజాలం కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గరుడ ప్లస్, ఎక్స్‌ప్రెస్ సహా మరో ఏసీ బస్సుకు ఒకే నెంబర్ ఉంది. ఈ విషయం బయటికి ఎలా వచ్చిందంటే.. ఆ మూడు బస్సుల మీద ఫైన్లు ఉన్నాయి. ఆ బస్సు నెంబరుతో ఈ-చలానా వెబ్‌సైట్‌లో వెతకగా.. ఏకంగా మూడు బస్సులు వివిధ చోట్ల ట్రాఫిక్ నిబంధనలు మీరినట్లు ఫలితం వచ్చింది. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ వన్ డిపోలో టీఎస్ 08 Z 0208 నంబర్‌తో ఉన్న బస్సు ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌గా నడుస్తోంది. హైదరాబాద్ 3 డిపోలోని గరుడ ప్లస్ సర్వీస్‌ కూడా అదే నంబర్‌పై తిరుగుతుంది. అంతేకాక, ఇంకో స్కానియా కంపెనీకి చెందిన మరో ఏసీ బస్సు కూడా ఇదే నెంబరుతో ఉంది.


Also Read: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అంచనా, ఎల్లో అలర్ట్ జారీ


ఒకే నెంబరుపై ఉన్న ఈ మూడు బస్సులకు హైదరాబాద్ పరిధిలో రెండు ట్రాఫిక్ చలాన్లు, సైబరాబాద్ పరిధిలో మరో రెండు చలాన్లు ఉన్నాయి. రాచకొండ, ఆదిలాబాద్, సిద్ధిపేట, కరీంనగర్ పరిధిలోనూ ఒక్కో చలాన్ చొప్పున ఉంది. మొత్తం ఒకే నెంబరుపై ఉన్న మూడు బస్సులపై 8 చలాన్లు ఉన్నాయి. అయితే, బస్సులు మాత్రం మూడు ఉండడం గమనించిన ఆర్టీవో అధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు. ఆ బస్సులకు ఒకే నెంబర్ ఎందుకు కేటాయించారనేది మాత్రం అర్థం కావడం లేదు.


Also Read: Gold-Silver Price: దీపావళి వేళ భారీగా తగ్గిన పసిడి.. వెండి కూడా.. ఏకంగా రూ.1,300 తగ్గుదల


సాధారణంగా ప్రైవేటు ట్రావెల్స్ నడిపేవారు ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతుంటారు. ఒకే నెంబరుకు అనుమతులు తీసుకొని అదే నెంబరుతో రెండు మూడు బస్సులు లేదా నాలుగు బస్సులు నడుపుతుంటారు. ఇలాంటి వ్యవహారాలు గతంలో ఎన్నో వెలుగు చూశాయి. దొరికినప్పుడల్లా ఆర్టీఏ అధికారులు ఫైన్లు కూడా వేస్తుంటారు. తాజాగా టీఎస్ఆర్టీసీలో ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.