భర్త వేధింపులు భరించలేక భార్య అతణ్ని హత్య చేసిన ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. రోకలి బండతో భర్తను చంపిన తర్వాత తనంతతానుగా పోలీసులకు లొంగిపోయింది. పోలీసులకు ఫోన్ చేసి తానే భర్తను చంపేసినట్లుగా సమాచారం ఇచ్చింది. అనంతపురం అశోక్ నగర్ కు చెందిన రాజేంద్ర ప్రసాద్ (51), కుసుమ (34), భార్యాభర్తలు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. తన భర్త తనకంటే వయసులో 20 ఏళ్ళు పెద్దవాడని, అయితే తనపై అనుమానం పెంచుకుని నిత్యం వేధింపులకు గురి చేసే వాడిని పోలీసులకు కుసుమ తెలిపింది. నిత్యం తాను పెట్టే చిత్ర హింసలు భరించలేక హత్య చేసినట్లు పోలీసులతో ఆమె చెప్పింది. ఆమెను అదుపులోకి తీసుకున్న ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: రూమ్ నెం.308 మిస్టరీ.. శృంగారంలో అపశృతి.. ప్రధాని క్షమాపణలు, అసలేం జరిగింది?


పోలీసులు తెలిపిన సమాచారం మేరకు పూర్తి వివరాలిలా ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్‌, కుసుమ భార్యాభర్తలు. అనంతపురం నగరంలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. అయితే చాలా రోజులుగా రాజేంద్రప్రసాద్‌ వివిధ కారణాలతో భార్యను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు. తన భర్త ఎప్పటికైనా మారతాడని కుసుమ కూడా సహనంతో అతనిని భరిస్తూ వచ్చింది. కానీ రాజేంద్రప్రసాద్‌ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో కుసుమ కూడా విసిగిపోయింది.


Also Read:  భర్త నిద్రిస్తున్న వేళ ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య.. కాసేపట్లోనే ఘోరం


ఇక తన భర్త మారడనుకుని నిర్ణయించుకున్న ఆమె రాజేంద్ర ప్రసాద్‌ను రోకలి బండతో కొట్టి చంపేసింది. ఆపై తానే ఈ హత్యకు పాల్పడినట్లు నేరుగా పోలీసులకు లొంగిపోయింది. పోలీసులు సంఘటనా వివరాలను నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే తండ్రి హత్యకు గురికావడం, తల్లి జైలుకు వెళ్లిపోవడంతో వీరి ఇద్దరి పిల్లలు అనాథలుగా మారిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.


Also Read: అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య... 80 కిలోమీటర్లు వెంబడించి కాల్పులు


Also Read: Kurnool Crime: బైక్ పై లవర్ మృతదేహం తరలింపు... హత్యా లేక ప్రమాదమా?


Also Read: వచ్చే మూడు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి


Also Read: హుజూరాబాద్ ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్... 20 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని ట్వీట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి